ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచే ప్రజా రవాణా అందుబాటులోకి రానున్నది. దాదాపు అరవై రోజుల తరువాత ఆర్టీసి బస్సులు రోడ్డుపై రైట్ రైట్ అంటూ ముందుకు సాగనున్నాయి. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కట్టడికి కేంద్రద ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌తో దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు రేపటి (గురువారం) నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే […]
నాలుగో విడత లాక్డౌన్లో కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ బస్సులను దశలవారీగా నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రైవేటు బస్సులు తిప్పేందుకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ బస్సులను తిప్పడంపై చర్చ సాగింది. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి తేదీలు వెల్లడిస్తారు. అయితే ఇందులో కఠిన నిబంధనలు తప్పక పాటించాల్సిందే. బస్సులో సగం సీట్లలో మాత్రం ప్రయాణికులను నింపి నడపాలి. ప్రైవేటు […]
ఉమ్మడి సమస్యపై చేసే పోరాటానికి మనుషుల్లో హోదాలు అడ్డురావని మరోసారి రుజువు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మచిలీపట్నంలోని రెడ్ జోన్ ఏరియాలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. మచిలీపట్నంలో ఉన్న సమస్యలను తెలుసుకున్న పేర్ని నాని మునిసిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మచిలీపట్నంలో కరోనా సోకి ఒకరు మరణించిన కారణంగా మచిలీపట్నం ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన విషయం […]
చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టటానికి అధికారపార్టీ తరపున ఇద్దరు నానీలూ కరెక్టుగా సరిపోతారా ? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రత్యర్ధులపై బురద చల్లటానికి తెలుగుదేశంపార్టీలో చంద్రబాబు దగ్గర నుండి చాలామంది నేతలే ఉన్నారు. వాళ్ళకిచ్చే ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు చల్లుతున్న బురదను తుడిచేసుకుంటూ తిరిగి గట్టిగా సమాధానం చెబుతున్నవాళ్ళు వైసిపి లో తక్కువనే చెప్పాలి. మంత్రుల్లో ప్రత్యర్ధులపై పాయింట్ బై పాయింట్ చెప్పి లాజిక్ తో […]
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అంతర్జాతీయ ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ ఉగ్రవాదికి చంద్రబాబుకు మధ్య తేడా ఏమీ లేదన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడని పేర్ని నాని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులను ప్రభుత్వం దాచిపెడుతోందని, రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని […]
కరోనా ప్రభావంతో సర్వం స్తంభించిన వేళ , ఇతర ప్రాంతాల నుండి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకొనే వారు , గుళ్లు , బస్టాండ్ , రైల్వే స్టేషన్లు ఆశ్రయించి ఉండేవారు , ఒక్కసారిగా నిరాశ్రయులు అవ్వటమే కాకుండా , వీరికి ఆహారం కూడా దొరకని పరిస్థితి . ఇలాంటి స్థితిలో వీరు లాక్ డౌన్ పాటించే పరిస్థితి పక్కన పెడితే , ఆహారం , వసతి కోసం అల్లడాల్సిన దుస్థితి . ఇది గమనించిన […]
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో శాసన సభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో బడ్జెట్‌పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల కాలానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు […]
కరోనా వైరస్ నివారణకు లాక్డౌన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నిత్యవసర సరుకులు విక్రయించే దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్రం లాక్డౌన్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ […]