iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి స్పిరిట్ అదిరిందిగా

  • Published Oct 24, 2025 | 11:02 AM Updated Updated Oct 24, 2025 | 11:02 AM

ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా ఆయన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని వచ్చేసాయి. హను రాఘవపూడి తన సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ రివీల్ చేస్తే.. రాజాసాబ్ టీమ్ ఆ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్ ను పోస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా తన అప్డేట్ తో ఎంట్రీ ఇచ్చాడు. ‘స్పిరిట్‌’కి సంబంధించి సౌండ్ స్టోరీ పేరుతో ఓ ఆడియో క్లిప్ విడుద‌ల చేశారు.

ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా ఆయన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని వచ్చేసాయి. హను రాఘవపూడి తన సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ రివీల్ చేస్తే.. రాజాసాబ్ టీమ్ ఆ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్ ను పోస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా తన అప్డేట్ తో ఎంట్రీ ఇచ్చాడు. ‘స్పిరిట్‌’కి సంబంధించి సౌండ్ స్టోరీ పేరుతో ఓ ఆడియో క్లిప్ విడుద‌ల చేశారు.

  • Published Oct 24, 2025 | 11:02 AMUpdated Oct 24, 2025 | 11:02 AM
సందీప్ రెడ్డి స్పిరిట్ అదిరిందిగా

ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా ఆయన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని వచ్చేసాయి. హను రాఘవపూడి తన సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ రివీల్ చేస్తే.. రాజాసాబ్ టీమ్ ఆ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్ ను పోస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా తన అప్డేట్ తో ఎంట్రీ ఇచ్చాడు. ‘స్పిరిట్‌’కి సంబంధించి సౌండ్ స్టోరీ పేరుతో ఓ ఆడియో క్లిప్ విడుద‌ల చేశారు. ఇందులో . ప్ర‌భాస్, ప్ర‌కాష్ రాజ్‌, ఇంకొకరి వాయిస్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంది. ఇంకే విజువల్స్ కనిపించలేదు. కానీ ఆ ఆడియో ఇచ్చిన హై మాత్రం అదిరిందని చెప్పాల్సిందే.

`డియ‌ర్ సూప‌రెండెంట్ సార్‌.. చిన్న‌ప్ప‌టి నుంచీ నాకో చెడ్డ అల‌వాటు ఉంది.. రైట్ ఫ్ర‌మ్ మై ఛైల్డ్ వుడ్.. ఐ హావ్ ఏ బ్యాడ్ హ్యాబిట్‌` అని ప్ర‌భాస్ త‌న‌ని తాను ప‌రిచ‌యం చేసుకోవ‌డం. అక్కడ ఖైదీస్ కానీ కాకిస్ కానీ మాత్రమే ఉండాలని ప్రకాష్ రాజ్ చెప్పడం లాంటి డైలాగ్స్ మంచి హై ఫీల్ ఇచ్చాయి. ఆడియో రూపంలో ఓ సినిమా గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. అసలే సందీప్ రెడ్డి వంగకు ఆరడుగుల ప్రభాస్ కటౌట్ దొరికింది. ఇక సందీప్ ఎలా చూపిస్తాడో.. ప్రభాస్ కోసం ఎలాంటి కథ రాసి రెడీగా ఉంచుకున్నాడో చూడాలి.

అసలు ప్రభాస్ కు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో.. అతను జైల్లోకి ఎందుకు వెళ్ళాడో ? రిమాండ్ పిరియ‌డ్ లో ప్ర‌కాష్ రాజ్ తో త‌న‌కు జ‌రిగిన గొడ‌వ ఏమిటో? ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కొత్త‌గా ఉండ‌బోతోందని టాక్. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.