iDreamPost
iDreamPost
చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టటానికి అధికారపార్టీ తరపున ఇద్దరు నానీలూ కరెక్టుగా సరిపోతారా ? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రత్యర్ధులపై బురద చల్లటానికి తెలుగుదేశంపార్టీలో చంద్రబాబు దగ్గర నుండి చాలామంది నేతలే ఉన్నారు. వాళ్ళకిచ్చే ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది.
కానీ వాళ్ళు చల్లుతున్న బురదను తుడిచేసుకుంటూ తిరిగి గట్టిగా సమాధానం చెబుతున్నవాళ్ళు వైసిపి లో తక్కువనే చెప్పాలి. మంత్రుల్లో ప్రత్యర్ధులపై పాయింట్ బై పాయింట్ చెప్పి లాజిక్ తో మాట్లాడుతున్నా ముగ్గురు నాలుగురు మంత్రులలో కొడొలి నాని, పేర్ని నాని ముందు వరసలో ఉంటారనే చెప్పాలి.
ఇద్దరు నానీలు కూడా ఇటు చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు అటు ఇతర పార్టీల్లోని ప్రత్యర్ధులపై గట్టిగా విరుచుకుపడుతున్నారు. కాకపోతే కొడాలి నాని మాటలు కాస్త ఘాటుగా ఉంటాయి. చంద్రబాబుతో పాటు టిడిపి నేతలపై కొడాలి చేసే విమర్శలకు, వారి ఆరోపణలకు సమాధానం చెప్పటంలో కొడాలి నోటి వెంట కాస్త అభ్యంతరకరమైన భాష వచ్చేస్తుంటుంది. దాన్ని మినహాయిస్తే చెప్పదలచుకున్నది సరదాగా, సెటైరికల్ గా సూటిగా ఉంటుందనే చెప్పాలి.
అదే సమయంలో పేర్నినాని ప్రెస్ మీట్లలో చాలా సరదాగా మాట్లాడుతాడు. ఎక్కడా ఆవేశం లేకుండా, ఎక్కువ తక్కువలు లేకుండా తూచినట్లుగా మాట్లాడుతాడు. మధ్యలో ప్రత్యర్ధులపై చెణుకులు విసురుతు, సామెతలు చెబుతూ రిపోర్టర్లతో పాటు వినేవాళ్ళను కూడా బాగా ఎంటర్ టైన్ చేస్తాడు. పేర్ని కూడా చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తాడనటంలో సందేహం లేదు.
బొత్స ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ప్రెస్ మీట్లు కూడా బాగుంటాయి . ఇక మిగిలిన మంత్రులు ప్రత్యర్ధులపై అంత తొందరగా స్పందించరు. కొందరు తరచూ మీడియాతో మాట్లాడుతున్న కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్ బాగా ఉండటంతో వారు చెబుతున్నది జనాలకు అంత తొందరగా రిజిస్టర్ కావటంలేదు. అందుకే మంత్రుల్లో ప్రెస్ మీట్లంటే నానీలు మాత్రమే హైలైట్ అవుతున్నారు.