ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలిసో, తెలియకో లేదా.. షూటింగ్లు లేక ఖాళీగా ఉన్నాడనో ఈ రోజు భవన నిర్మాణ కార్మికులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మందితో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ ఇసుక కొరత సమస్య ఎదుర్కొంటోందన్నారు. ఇసుక సరఫరాను సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పదమే ఈ […]
Unconventional politics of Jagan Man is a creature of habit అంటారు మానసిక విశ్లేషకులు. మనిషి ఒక పద్ధతికి అలవాటు పడిపోయి అలాగే జీవితం గడుపుతూ ఉంటాడు. ఏ కారణం చేతనైనా అది కొంచెం మారితే కంగారుపడిపోయి ఆ పద్ధతి తిరిగి నెలకొనేవరకూ అశాంతికి గురవుతాడు అంటారు విశ్లేషకులు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నాయకులు తరతరాలుగా పార్టీలకతీతంగా అలవాటు పడిపోయిన పద్ధతులను ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఛిన్నాభిన్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. […]
హరీష్ శంకర్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదుని సార్థకం చేస్తూ ఈ దర్శకుడు ఇచ్చిన ఈ బ్లాక్ బస్టర్ ఇటీవలే 8 ఏళ్ళు పూర్తి చేసుకుని సోషల్ మీడియాలో హంగామా చేసింది. ఇంత గ్యాప్ తర్వాత ఇతనికి పవన్ 28 డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. పవన్ ముందు వకీల్ సాబ్ ఫినిష్ […]
ఈ మధ్య మనవాళ్ళ కన్ను మలయాళం మీద ఎక్కువ పడుతోంది. అక్కడేదైనా సినిమా హిట్టవ్వడం ఆలస్యం వెంటనే రైట్స్ కొనేసుకుని క్యాస్టింగ్ ని సెట్ చేసుకునే పనిలో పడుతున్నారు. మెగాస్టార్ అంతటివాడే ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ అయిన లూసిఫర్ రీమేక్ కు సిద్ధపడ్డారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరికొన్ని కేరళ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు ఇక్కడ క్యూలో నిలుచుంటున్నాయి. వాటిలో మొదటిది డ్రైవింగ్ లైసెన్స్. ఆ మధ్య రామ్ చరణ్ హక్కులు కొన్నాడని టాక్ వచ్చింది […]
లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్, విరుపాక్ష షూటింగులకు బ్రేక్ తీసుకుని రెస్ట్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీటి తర్వాత గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్టు మొన్నే అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో అంచనాలు అప్పుడే ఎగబాకడం మొదలైంది. తాజాగా హీరొయిన్ కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్ లో పూజా […]
సరిగ్గా 8 ఏళ్ళ క్రితం గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ లు మరోసారి టీమప్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్, విరుపాక్ష(వర్కింగ్ టైటిల్)తర్వాత ఇదే 28వ సినిమాగా ఉండబోతోంది. ఏ జానర్ అనే లీక్ బయటికి రానివ్వడం లేదు కాని ఒక్కొక్కరుగా సాంకేతిక నిపుణులను సెట్ చేసుకుంటున్నారు హరీష్ శంకర్. తాజాగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని లాక్ చేస్తూ అఫీషియల్ […]
తెలుగు న్యూస్ చానెళ్ల తీరు రానురాను రాజకీయ పార్టీలను మించిపోతోంది. పార్టీ నాయకుల తరహాలో న్యూస్ యాంకర్లు, అధినేతల మాదిరిగా ఆయా సంస్థల యజమానులు వ్యవహరిస్తున్నారనే విమర్శ నిజమేననిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కొన్ని చానెళ్లు వ్యవహరిస్తున్నాయి. కొన్నిసార్లు హద్దు మీరి వ్యవహరిస్తున్నాయి. అలాంటి ధోరణికి కొనసాగింపుగానే అన్నట్టుగా ఓ చిన్న ఘటనను భూతద్దంలో చూపించి, సానుభూతి పొందాలనే ప్రయత్నాలకు కూడా దిగుతున్నాయి. సహజంగా రాజకీయాల్లో గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకూ అందరి నేతలూ అదే తరహాలో […]
ప్రస్తుతం బీజేపీలో ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాధినేని యామినీ అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామిక వేత్తల సంఘ గౌరవాధ్యక్షులుగా నియమితులయ్యారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ CIMSME , CEIIE గౌరవ అధ్యక్షురాలిగా ఎంపికైనట్లు తెలిపారు . ఈ సంఘం 4700 మంది పారిశ్రామిక వేత్తల జాతీయ నెట్ వర్క్ తోనూ , పలువురు యువ పారిశ్రామిక వేత్తలతోనూ అనుసంధానమై ఉన్నదని తెలిపారు. సాధినేని యామినీ గతంలో తెలుగు దేశం మహిళా విభాగం అధికార […]