iDreamPost
android-app
ios-app

పవర్ స్టార్ 27లో టాలెంటెడ్ హీరో

  • Published Apr 27, 2020 | 5:42 AM Updated Updated Apr 27, 2020 | 5:42 AM
  • Published Apr 27, 2020 | 5:42 AMUpdated Apr 27, 2020 | 5:42 AM
పవర్ స్టార్ 27లో టాలెంటెడ్ హీరో

లాక్ డౌన్ కారణంగా సినిమా, రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇది పూర్తైన వెంటనే ఆఘమేఘాల మీద వకీల్ సాబ్ బాలన్స్ షూటింగ్ ని ఫినిష్ చేయాలి. మేలో అనుకున్న విడుదల కాస్తా అసలు ఎప్పటికి సెట్ అవుతుందో అంతు చిక్కడం లేదు. థియేటర్ల ఓపెనింగ్ కు సంబంధించి ఎలాంటి స్పష్టత ప్రస్తుతానికి లేదు. ఇదిలా ఉండగా దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీ చేస్తున్న పవన్ వకీల్ సాబ్ తర్వాత ఏకధాటిగా దాని కోసమే డేట్స్ కేటాయించబోతున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ నుంచి అర్జున్ రాంపాల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఫిక్స్ అయ్యారనే టాక్ ఉండగా పాన్ ఇండియా లెవెల్ లో ఇది భారీ బడ్జెట్ తో రూపొందుతుండటంతో మల్టీ లాంగ్వేజ్ స్టార్స్ ని కూడా రంగంలోకి దించుతున్నారు. అందులో భాగంగా ఒక క్రేజీ టాలెంటెడ్ హీరోని ఇప్పుడీ సినిమా కోసం ఎంచుకోబోతున్నట్టుగా హాట్ అప్ డేట్. అతనే శివ కార్తికేయన్. మనవాళ్ళకు పెద్దగా పరిచయం లేకపోయినా డబ్బింగ్ సినిమాల ద్వారా అంతో ఇంతో సుపరిచితుడే. శక్తి, సీమరాజా, రెమో లాంటి మూవీస్ ఇక్కడ ఆడకపోయినా బుల్లితెరపై వర్క్ అవుట్ అయ్యాయి. ఆ మధ్య వచ్చిన కౌసల్య కృష్ణమూర్తిలో హీరొయిన్ ఐశ్వర్య రాజేష్ కు కోచ్ గా కీలక పాత్ర చేసింది ఇతనే.

మంచి టాలెంటెడ్ యాక్టర్ అయిన శివ కార్తికేయన్ ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే కోలీవుడ్ లోనూ పవన్ సినిమాకు క్రేజ్ వస్తుంది. సైరాలో విజయ్ సేతుపతిని తీసుకొచ్చినట్టు ఇక్కడా అదే తరహాలో ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు. విరుపాక్షి అనే టైటిల్ గట్టి ప్రచారంలో ఉంది కానీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందటం లేదు. కరోనా ప్రభావం లేకపోతే ఈ ఏడాదిలోనే దీన్ని విడుదల చేసేలా ఏఎం రత్నం ప్లాన్ చేసుకున్నారు. కాని ఇప్పుడా అవకాశాలు ఎంతమాత్రం లేవు. 2021 సమ్మర్ లో తప్ప అంతకు ముందు వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఇందులో పవన్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నట్టు వినికిడి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom