iDreamPost
android-app
ios-app

పవన్ 28 కోసం పవర్ ఫుల్ కాంబో

  • Published May 11, 2020 | 3:44 PM Updated Updated May 11, 2020 | 3:44 PM
  • Published May 11, 2020 | 3:44 PMUpdated May 11, 2020 | 3:44 PM
పవన్ 28 కోసం పవర్ ఫుల్ కాంబో

సరిగ్గా 8 ఏళ్ళ క్రితం గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ లు మరోసారి టీమప్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్, విరుపాక్ష(వర్కింగ్ టైటిల్)తర్వాత ఇదే 28వ సినిమాగా ఉండబోతోంది. ఏ జానర్ అనే లీక్ బయటికి రానివ్వడం లేదు కాని ఒక్కొక్కరుగా సాంకేతిక నిపుణులను సెట్ చేసుకుంటున్నారు హరీష్ శంకర్. తాజాగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని లాక్ చేస్తూ అఫీషియల్ గా ట్వీట్ చేశాడు.

మరోసారి రచ్చ చేయడానికి రెడీ అవుతున్నామని గబ్బర్ సింగ్ లో ఇంటర్వెల్ డైలాగ్ ఇప్పుడే మొదలైంది అంటూ అందులో ఊరించేశారు. ఆ టైంలో దేవి ఇచ్చిన మ్యూజిక్ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హరీష్ శంకర్ దేవిలు గబ్బర్ సింగ్ తర్వాత డిజే దువ్వాడ జగన్నాధం కోసం పని చేశారు మళ్లి ఆ కాంబో సాధ్యపడలేదు. రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దల కొండ గణేష్ సినిమాలకు వేరే సంగీత దర్శకులు వర్క్ చేశారు. సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ 8 ఇయర్స్ హంగామా జరుగుతున్న వేళ ఈ గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ మహా ఖుషిగా ఉన్నారు.

పవన్ – దేవి కాంబోలో ఇప్పటికే మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ ఎంత డిజాస్టర్ అయినా దేవి ఇచ్చిన సాంగ్స్ బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. అంతకు ముందు అత్తారింటికి దారేది, జల్సా లాంటి సూపర్ ఆల్బమ్స్ ఈ కలయికలో వచ్చాయి. వీటి సంగతి ఎలా ఉన్నా గబ్బర్ సింగ్ త్రయం మళ్ళీ కలవబోతుండటం మాత్రం అభిమానులకు సూపర్ న్యూసే. లాక్ డౌన్ అయ్యాక మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి హరీష్ శంకర్ ఆలోగా స్క్రిప్ట్ ని మరింత పదును పెట్టే పనిలో పడతారట.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş