iDreamPost
android-app
ios-app

స్వీటీ గురించి 2 స్వీట్ న్యూస్

  • Published May 05, 2020 | 12:17 PM Updated Updated May 05, 2020 | 12:17 PM
  • Published May 05, 2020 | 12:17 PMUpdated May 05, 2020 | 12:17 PM
స్వీటీ గురించి 2 స్వీట్ న్యూస్

నిజమో కాదో కానీ అనుష్కకు సంబంధించిన రెండు వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న విరూపాక్ష(ప్రచారంలో ఉన్న టైటిల్)లో తనే హీరొయిన్ గా సెలెక్ట్ అయ్యిందని. గతంలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఎంపికైనట్టు టాక్ వచ్చింది కాని అది సపోర్టింగ్ రోలట. కథలో కీలకంగా ఉంటుంది కాని పవన్ కు జోడి కాదన్నది ఫ్రెష్ అప్ డేట్. హీరోని ప్రేమిస్తుంది కాని దక్కించుకోలేక మధనపడే పాత్రలో అది ఉంటుందట.

అనుష్క మాత్రం అసలు కథానాయికగా ఉంటుందన్నది వినికిడి. అయితే స్వీటీ నుంచి దీని గురించి ఎలాంటి స్పందన ప్రస్తుతానికి లేదు. ప్రాథమికంగా చర్చలు జరిగాయని లాక్ డౌన్ అయ్యాక ఫైనల్ వెర్షన్ విన్నాక ఏ నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. అన్నయ్య చిరంజీవితో స్టాలిన్ లో స్పెషల్ సాంగ్ చేసి సైరాలో జస్ట్ కొన్ని సీన్లు చేసిన అనుష్క ఇప్పుడు తమ్ముడు పవన్ తో మాత్రం ఫుల్ లెన్త్ రోల్ చేస్తుందన్న మాట. పవన్ ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు కూడా అనుష్క తనతో చేసే ఆఫర్ రాలేదు. ఇప్పుడు రావడం అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కూ గుడ్ న్యూసే.

ఇక రెండో వార్త విషయానికి వస్తే నిశ్శబ్దం డిజిటల్ డీల్ ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని ఇన్ సైడ్ టాక్. మూడో వారంలో ఓ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ద్వారా రిలీజ్ చేయొచ్చనే మాట బలంగా వినిపిస్తోంది. ఆ మధ్య ఒకసారి ఈ వార్తను ఖండించారు కానీ తర్వాత సైలెంట్ అయ్యారు. థియేటర్లు తీసే సూచన దగ్గరలో లేకపోవడంతో పాటు మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి ఓవర్సీస్ లో అంత ఈజీగా విడుదల చేయడం సాధ్యపడటం లేదు. అందులోనూ ఓటిటి ఆఫర్ చేసిన అమౌంట్ భారీగా ఉండటంతో వేరే ఆప్షన్ లేక సిద్ధపడినట్టు తెలిసింది. ఏదేమైనా సదరు ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ లేదా యాప్ నుంచి అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు దీన్ని ఖరారు చేయలేం కానీ ఇప్పటికైతే ఇవి స్వీటీ ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చేవే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom