ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ విషయంలో, సంక్షేమ పధకాల అమలు విషయంలో అడ్డగోలు నిబందనలు పెట్టిన నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో ప్రభుత్వ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు కీలక వాఖ్యలు చేసింది. తిరిగి స్థానిక ఎన్నికల తేది నిర్ణయించాకే తిరిగి కోడ్ ప్రకటించాలని , అప్పటి వరకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు రాష్ట్ర హైకోర్టు మరో మారు విచారణ జరిపింది. నిమ్మగడ్డ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు గత శనివారం రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. శనివారం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రాథమికమైనదని.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో […]
కరోనా వైరస్ నేపధ్యంలో బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల సాయం కూడా వివాదస్పదమైంది. స్ధానిక సంస్ధల్లో లబ్ది పొందటం కోసమే ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అధికారపార్టీ అభ్యర్ధులు తమ చేతుల మీదగా పంపిణి చేస్తున్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖరాశారు. అంతకుముందే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అధికారపార్టీపై ఇటువంటి ఆరోపణలే చేశారు. కన్నా నుండి వచ్చిన లేఖ ఆధారంగా నిమ్మగడ్డ వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు […]
రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ నిమ్మగడ్డ లేఖ వ్యవహారం ఇంకా చల్లబడకుండానే ప్రభుత్వం పై ఫిర్యాధు చేస్తు మరో అధికారి గవర్నర్ ను కలిసారని ఆంధ్రజ్యోతి పత్రిక లో ఒక కధనం ప్రచురితం అయింది . ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కధనం ప్రకారం, ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారని గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూ మూడుపేజీల లేఖను గవర్నర్ […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాశారని చెబుతున్న లేఖపై ఆయన ఎందుకు స్పందించడంలేదని వైసీపీ ప్రశ్నించింది. లేఖ ఎవరు రాశారన్న విషయం తేల్చాలని వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర డీజీపీని కలిసి విన్నవించారు. అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ లేఖ రాశారా..? లేదా..? అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు. ఐదు పేజీల లేఖలో ఏముందో తూచా తప్పకుండా ఆంధ్రజ్యోతి, ఈనాడులు ప్రచురించాయి. ప్రభుత్వాన్ని, పోలీసులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు […]
జగన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో అప్రమత్తమయిన జగన్ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలన్న సంకల్పానికి వచ్చినట్టు కనిపిస్తోంది. కేవలం అధికారం దక్కితే అన్ని చోట్లా తాము అనుకున్నట్టుగా జరిగిపోతుందనే అంచనాల నుంచి ఆయన బయటకు వస్తున్నట్టు చెబుతున్నారు. దానిఇక తగ్గట్టుగా తాజా వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వ్యవహారం ప్రతిష్టంభనగా మారుతోంది. రాజ్యాంగ సంక్షోభం వైపు పరిణామాలు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. […]