iDreamPost
android-app
ios-app

‘రమేష్‌కుమార్‌ ఎందుకు నోరు విప్పడం లేదు..?’

‘రమేష్‌కుమార్‌ ఎందుకు నోరు విప్పడం లేదు..?’

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాశారని చెబుతున్న లేఖపై ఆయన ఎందుకు స్పందించడంలేదని వైసీపీ ప్రశ్నించింది. లేఖ ఎవరు రాశారన్న విషయం తేల్చాలని వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర డీజీపీని కలిసి విన్నవించారు. అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

‘‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ లేఖ రాశారా..? లేదా..? అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు. ఐదు పేజీల లేఖలో ఏముందో తూచా తప్పకుండా ఆంధ్రజ్యోతి, ఈనాడులు ప్రచురించాయి. ప్రభుత్వాన్ని, పోలీసులను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోంది. పచ్చి రాజకీయ నేత రాసినట్లుగా ఈ లేఖ ఉంది. ఇంత గందరగోళం జరుగుతుంటే రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయారు. లేఖ నేను రాశాననో, రాయలేదనో చెప్పాల్సిన పని లేదా..?అని రాంబాబు ప్రశ్నించాడు

చంద్రబాబు, టీడీపీ కుట్రలో రమేష్‌కుమార్‌ పావుగా మారారు. తాను ఆ లేఖ రాయలేదని న్యూస్‌ ఏజెన్సీలకు చెబుతారు. కానీ ఎందుకు బయటకు వచ్చి మీడియాకు చెప్పరు..? ఇదేమి డ్రామా..? రమేష్‌కుమార్‌ చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు దుర్భిద్దిని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అమలు చేస్తున్నారు. ఆయన బయటకు రావాలి. హైదరాబాద్‌ వెళ్లి ఎందుకు ఫోన్‌ స్విచ్చ్‌ ఆఫ్‌ చేసుకున్నారు. మీడియా ప్రతినిధులను ఎందుకు కలవడంలేదు..? అని రాంబాబు ప్రశ్నించాడు

ఆ లేఖ రమేష్‌కుమార్‌ రాసి ఉంటే.. దాన్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. ఈ కుట్రను భగ్నం చేసే వరకూ వదిలిపెట్టాం. అందుకే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాం. విచారణ జరపాలని కోరాం. ’’ అని అంబటి రాంబాబు చెప్పారు.