తమకు ఇష్టం లేని వాళ్లు ఎలాంటి మంచి పనులు చేసినా కొందరికి కనిపించవు. వినిపించవు. పైగా విపరీతమైన రాజకీయ కడుపు మంటతో బాధపడుతూ.. ఆ అసహనాన్ని ఇతరులపై నిందలు వేయడం ద్వారా తగ్గించుకోవడానికి చూస్తారు. అలాంటి కోవలోకే చెందుతారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్‌ను వాడు వీడు అంటూ చులకనతో మాట్లాడడంతోపాటు లేనిపోని అభాండాలు వేస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో జేసీ […]
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు భక్తులు ఇచ్చిన ఆస్తుల్లో నిరర్ధకరమైన వాటిని విక్రయించే విధానంపై శాశ్వత నిషేధం విధిస్తూ తీర్మానించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీకి చెందిన 50 నిరర్ధక ఆస్తులను అమ్మేందుకు అప్పటి బోర్డు తీసుకున్న నిర్ణయంపై ఇటీవల సమీక్ష చేసిన సందర్భంగా అదే తెలుగుదేశం, బీజేపీ నేతలు వివాదాస్పదం చేసిన విషయం తెలిసిందే. దీనికి పరిష్కారంగా టీటీడీకి […]
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పూర్వ పాలక మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రస్తుత పాలక మండలి నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ ఆస్తులు, భూములు అమ్మకూడదని తీర్మానించారు. ఎక్కడైనా ఆస్తులు ఆన్యాక్రాంతమవుతూ అమ్మకం తప్పనిసరి అయితే స్వామిజీలతో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. తిరుమలలో పాత భవనాల ఆధునికీకరణ కోసం […]
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)పై దుష్ప్రచారానికి టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నారని, ఆయనకు కొంతమంది బిజెపి నేతలు వత్తాసు పలకడం దురదృష్టకరమని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో టిటిడి ఆస్తులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఒక టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం టిటిడి ఆస్తులను వేలం వేస్తోందన్న దుష్ప్రచారం అంతా చంద్రబాబు కుట్రే. […]
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల విక్రయాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆస్తుల ప్రక్రియను నిలిపివేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వేలం నిర్వహణకు సంబంధించి నియమించిన రెండు బృందాలను రద్దు చేశారు. శ్రీవారి ఆస్తుల వేలం వేయాలని 2016లో అప్పటి పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ నిన్న సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. […]
ఇన్ని వార్తా పత్రికలు, వాటిలో అధికార పార్టీకి చెందింది ఒకటి; పదుల సంఖ్యలో టీవీ ఛానెళ్ళు, వాటిలోనూ అధికార పార్టీకి చెందింది ఒకటి; లెక్కకు మించి వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ళు, అన్నిటికి మించి దాదాపు ప్రతీ ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉన్న రోజులివి. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలతో పాటు వాటి పూర్వోత్తరాలను సైతం పది నిముషాల్లో ఇంటర్నెట్ ద్వారా కనుక్కోగల వెసులుబాటు ప్రతీ వ్యక్తికి ఉంది. అంత సమాచారం అందరికీ అందుబాటులో ఉండే ప్రస్తుత పరిస్థితుల్లోనే […]
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి దేశమంతటా జనతా కర్ఫ్యూ విధించడానికంటే రెండు రోజుల ముందే కరోనా కలకలాన్ని ముందే అంచనా వేసిన టీటీడీ భక్తుల సంక్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులందరికి దర్శనాన్ని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా తీవ్రత అధారంగా గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లు గా విభజించి ఒక్క రెడ్‌జోన్ మినహా మిగతా జోన్లలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో టీటీడీ లో […]
కరొనా కల్లోలంలో ప్రజలను ఆడుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరొనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా టీటీడీ అందించనున్న సహాయ సహాకారాల గురించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియా ప్రకటన ద్వారా వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక అలమటిస్తున్న పేదలకు, అనాధలకు, ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలకు నిరంతరాయంగా […]
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రతిరోజూ కరోనా వైరస్ కట్టడికి సమీక్ష నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖా మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిపై అపోహలను కలిగించి ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేసారు. వైరస్ కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని అందులో భాగంగా విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకూ సెలవులను ప్రకటించామని వైద్యశాఖా మంత్రి ఆళ్ళ నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ […]