Idream media
Idream media
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పూర్వ పాలక మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రస్తుత పాలక మండలి నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ ఆస్తులు, భూములు అమ్మకూడదని తీర్మానించారు. ఎక్కడైనా ఆస్తులు ఆన్యాక్రాంతమవుతూ అమ్మకం తప్పనిసరి అయితే స్వామిజీలతో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.
తిరుమలలో పాత భవనాల ఆధునికీకరణ కోసం జరిగిన కేటాయింపుల్లో టీటీడీపై కావాలనే దుష్ప్రచారం చేసిన వారిపై విచారణకు ఆదేశిస్తూ, చర్యల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పాలక మండలిపై ఆరోపణలు చేసిన వారిపై కూడా సమగ్ర దర్యాప్తు చేయించాలని తీర్మానించారు. నామినేషన్లపై అతిథి గృహాలు కేటాయించడం రద్దు చేయాలని నిర్ణయించారు.
లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ప్రభుత్వం అనుమతి ఇస్తే స్వామి వారి దర్శనం పునః ప్రారంభించాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందు కోసం అవసరమైన చర్యలు ఇప్పటికే చెప్పట్టిన తెలిపింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో చిన్న పిల్లల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది.