ప్రధానమంత్రి మోడీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ నాడు బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పిన పీఎం ఇప్పుడు ఇంట్లో దీపాలు ఆర్పి, బయట దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ నాటినుంచి ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ ప్రధాని మాటలను ఆచరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం మాటలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి. మహమ్మారిని మట్టుపెట్టేందుకు సంపూర్ణంగా సహకరిస్తున్నాయని మోడీ కూడా ప్రశంసలు కురిపించారు. దాంతో ప్రధాని నుంచి తమకు ఏదో ప్రతిఫలం దక్కుతుందని ఆశించిన […]
కరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. నిన్న మొన్నటి వరకూ దాని ప్రభావం భారత్పై పెద్దగా లేదనుకున్న వారికి తాజాగా పెరిగిన కేసులు కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో తెలియజేస్తోంది. లాక్డౌన్ చేసి వైరస్ను కట్టడి చేశామని భావిస్తున్న పాలకులకు రెండు మూడు రోజుల్లో కరోనా కాటు కళ్లు తెరిపిస్తుందని ప్రజలు భావించారు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెడతారని ఆశించారు. కానీ దేశ పాలకుడు నరేంద్ర మోదీ తన నుంచి మాటలు తప్పా చేతలు […]
మోడీ పాలనలో అన్నీ సంచలనాలే. హఠాత్తు నిర్ణయాలే. నోట్ల రద్దు నుంచి లాక్ డౌన్ వరకూ అంచనాలకు అందని రీతిలో విధానాలే. కానీ ఇప్పుడు అనూహ్యంగా మోడీ తన నిర్ణయానికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. లాక్ డౌన్ సడలించే ఆలోచన గురించి ఆయన ప్రస్తావించారు. తన మనసులో మాటను ముఖ్యమంత్రుల ముందు బయటపెట్టారు. ఒకసారి లాక్ డౌన్ సడలిస్తే ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తారని ఆయనే చెప్పారు. అలాంటి సమస్యలను అధిగమించేందుకు కసరత్తులు చేయాలని సూచించారు. […]
లాక్ డౌన్ తర్వాతి పరిణామాలు కలచివేసే దిశలో సాగుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా వలసజీవులను ఇక్కట్లలోకి నెట్టింది. వారికి ప్రాణసంకటగామారింది. ఉన్న చోట ఉండేందుకు అవకాశం లేక, సొంత ఊరికి వెళ్లేందుకు దారి తెన్నూ లేక తల్లడిల్లిపోతున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే మార్గం మధ్యలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు భారతావని తలదించుకోవాల్సిన స్థితిని చాటుతోంది. మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆవెంటనే లాక్ […]
కరోనా కలకలం వివిధ వర్గాలపై పడుతోంది. అన్ని తరగతులను అతలాకుతలం చేస్తోంది. చివరకు మందు బాబులను కూడా వదిలిపెట్టడం లేదు. తాగేందుకు మందు దొరక్కపోవడంతో వందల మంది విలవిల్లాడిపోతున్నారు. ఇప్పటికే వారం రోజులు గడిచిన నేపథ్యంలో ఇక తట్టుకోలేని స్థితికి చేరుతున్నారు. మద్యానికి బానిసలుగా మారిన వారికి ఒక్కసారిగా మందు అందుబాటులోకి రాకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. మానసిక ప్రవర్తనలో పెను మార్పులకు కారణంగా మారుతోంది. పిచ్చాసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. మార్చి 22 నాడు జనతా […]
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అతలాకుతలమవుతోంది. ప్రపంచ దేశాలు లాక్డౌన్ అయ్యాయి. వైరస్ను అరికట్టేందుకు సామాజిక దూరం ఒక్కటే పరిష్కారం కావడంతో ప్రపంచ దేశాలు లాక్డౌన్ ప్రకటించారు. ఈ కోవలోనే భారతదేశంలోనూ లాక్డౌన్ ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన జరిగిన జనతా కర్ఫ్యూ నుంచి దేశంలో లాక్డౌన్ అమలవుతోంది. ఈ రోజు సోమవారం నాటికి తొమ్మిది రోజులువుతోంది. వచ్చే నెల 14వ తేదీ వరకు.. అంటే మరో పక్షం రోజుల పాటు ఈ లాక్డౌన్ కొసాగుతుంది. […]
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నారు. ఆయన స్వగృహం హైదరాబాద్ లో నిర్మించుకోవడంతో చంద్రబాబు హైదరాబాదులో ఉంటున్నారు.అయితే ఇప్పుడు ప్రజలు ఎన్నడూ లేనంత విపత్కాలం ఎదుర్కొంటున్నారు. అందరికీ మించి చంద్రబాబు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి ప్రధాన కారణం ఆయన తీరు. సహజంగా చంద్రబాబుకి ప్రచార యావ పట్ల ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. తెలుగు ప్రజలకు దాని గురించి తెలియనది కాదు. చివరకు హుద్ హుద్ వంటి తుఫాన్లను కూడా పెద్ద […]
పరిశుభ్రతే ఆయుధం. సోషల్ డిస్టెన్సే రక్షణ కవచం.. ఇదే ప్రస్తుతం మహమ్మరి కరోనా వైరస్ వ్యాప్తికి నివారణకు ప్రపంచం ఆచరిస్తున్న మంత్రం. కరోనా వైరస్ ప్రభలుతున్నా.. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు నిత్యం తమ విధులను నిర్వర్తిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ కొనసాగేలా చేయడంలో పోలీసులు, కరోనా బాధితులకు వైద్యులు సహాయమందిస్తుండగా పారిశుధ్య కార్మికులు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలందరూ ఇళ్లకే పరిమతమవగా.. వీరు మాత్రం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. […]
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సోషల్ డిస్టెన్స్ మాత్రమే మన ముందు ఉన్న మందు అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కొద్దిసేపటి క్రితం జాతినుద్ధేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ప్రజలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు దేశం లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జనతా కర్ఫ్యూను మించి ప్రజలు లాక్డౌన్ను పాటించాలని మోదీ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలే కరోనాను నియంత్రించలేకపోతున్నాయని […]
మరో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 27న శుక్రవారం నుంచి సమావేశాలు జరగనున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో సమావేశాలు నాలుగైదు రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ పెట్టడం, ఆమోదించుకోవడం అంతా శరవేగంగా చేయాల్సిన పరిస్థితి కరోనా కారణంగా తలెత్తింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై అస్త్రాలు సంధించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సిద్ధమవతున్నారు. సమావేశాల్లో కరోనా వైరస్ అంశంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కరోనా కట్టడికి […]