iDreamPost
android-app
ios-app

కరోనా ఎఫెక్ట్ – రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం

  • Published Mar 21, 2020 | 8:11 AM Updated Updated Mar 21, 2020 | 8:11 AM
కరోనా ఎఫెక్ట్ – రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం

ఇప్పటికే 182 దేశాలకు విస్తరించి ప్రపంచ మానవాళికి మహమ్మారిలా తయారైన కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఇప్పటికే తమ వంతు బాధ్యతగా పలు చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెళ్ళిళ్ళు , జాతరలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని, ఆలయాలు, చర్చిలు , మసీదులకు వెళ్లకపొతే మంచిదని, సినిమా హాళ్ళు, పబ్లిక్ పార్కులు, మాల్స్ , జిమ్ములు మూసివేయాలని ప్రజలందరూ తమ విధిలో భాగంగా సేఫ్టి రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేసింది.

అయితే ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ కట్టడికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది, వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు రాష్ట్ర రవాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి ఏప్రిల్ 5వరకు వాహనాలకు కొత్త లైసెన్సుల జారీ, డ్రైవింగ్ ,లెర్నింగ్ లైసెన్సుల జారీని వాయిదా వేస్తునట్టు రాష్ట్ర రవాణా శాఖ కమీషనర్ పీ.సీతారామాంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు రాష్రంలోని అన్ని జిల్లాల ఉప రవాణా కమీషనర్లకు ఆయన ఆదేశాలు పంపించారు. వివిధ రవాణా సేవలు పొందేందుకు పెద్ద సంఖ్యలో వాహనదారులు రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునట్టు చెప్పుకొచ్చారు.

కాగా, జనతా కర్ఫ్యూ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రేపు ఆదివారం ఆర్టీసీ సర్వీస్ లను నిలిపివేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు నిర్ణయం తీసుకోగా తెలంగాణ నుంచి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.