Idream media
Idream media
పరిశుభ్రతే ఆయుధం. సోషల్ డిస్టెన్సే రక్షణ కవచం.. ఇదే ప్రస్తుతం మహమ్మరి కరోనా వైరస్ వ్యాప్తికి నివారణకు ప్రపంచం ఆచరిస్తున్న మంత్రం. కరోనా వైరస్ ప్రభలుతున్నా.. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు నిత్యం తమ విధులను నిర్వర్తిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ కొనసాగేలా చేయడంలో పోలీసులు, కరోనా బాధితులకు వైద్యులు సహాయమందిస్తుండగా పారిశుధ్య కార్మికులు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలందరూ ఇళ్లకే పరిమతమవగా.. వీరు మాత్రం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారి కాళ్లు కడిగి సత్కరించారు. ఐదుగురు పారిశుధ్య కార్మికులను తన కార్యాలయానికి పిలుపించుకున్న ప్రధాని మోదీ జలంతో వారి కాళ్లు కడిగారు. పరిశభ్రమైన వస్త్రంతో తుడిచారు. అనంతరం వారందరినీ శాలువాతో సత్కరించారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు.
పారిశుధ్య కార్మికులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులకు ఈ నెల 22న జరిగిన జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ పిలుపు మేరకు ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రజలందరూ తమ ఇళ్ల బయటకు వచ్చి చప్పట్లతో వారిని అభినందించారు.