iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నారు. ఆయన స్వగృహం హైదరాబాద్ లో నిర్మించుకోవడంతో చంద్రబాబు హైదరాబాదులో ఉంటున్నారు.అయితే ఇప్పుడు ప్రజలు ఎన్నడూ లేనంత విపత్కాలం ఎదుర్కొంటున్నారు. అందరికీ మించి చంద్రబాబు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి ప్రధాన కారణం ఆయన తీరు. సహజంగా చంద్రబాబుకి ప్రచార యావ పట్ల ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. తెలుగు ప్రజలకు దాని గురించి తెలియనది కాదు. చివరకు హుద్ హుద్ వంటి తుఫాన్లను కూడా పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకున్న ఘనత ఆయనది.
ఇప్పుడు మాత్రం ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో కొంత సమస్యలున్నప్పటికీ విపక్ష నేతగా కూడా ఆయన విపరీతంగా ప్రచారం కోరకుంటారు.ఇటీవల కాలంలో అత్యధికంగా మీడియా సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆ విషయాన్ని చాటుకున్నారు. ఒకేరోజు గంట వ్యవధిలో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టిన అనుభవం ఆయనది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా సమయంలో కూడా చంద్రబాబు ఒకరంగా చెలరేగిపోయేవారే అని చెప్పక తప్పదు.
అనూహ్యంగా ఆయన తెలంగాణాలోని ఉండిపోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ ఒకరోజు జనతా కర్ఫ్యూ కోసం సొంత ఇంటికి వెళ్లిన చంద్రబాబు అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. దాంతో కనీసం పార్టీ నేతలతో సమీక్షలు, ఇతర కార్యకలాపాలు అంటూ నిత్యం మీడియాలో ఉండే అవకాశం ఆయన కోల్పోయారు. చివరకు లాక్ డౌన్ సమయంలో కూడా ఆయన ఏదో కార్యక్రమంతో ప్రచారం చేసుకునే వారనడంలో అనుమానం లేదు. ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో ఆయన సతమతం అవుతున్నట్టు కనిపిస్తోంది. జీవితంలో ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబుకి ఇది పెద్ద సమస్య అవుతుందనడంలో సందేహం లేదు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రయత్నించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన 14రోజుల పాటు క్వారంటైన్ కి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో ఆయన తిరిగి ఏపీకి వచ్చే అవకాశం కూడా లేదు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం కూడా మూతవేశారు. సిబ్బందికి సెలవు ప్రకటించారు. కొద్ది మంది మాత్రం గుంటూరు ఆఫీసు నుంచి పనిచేస్తున్నారు. ప్రెస్ నోట్లు , ఇతర సమాచారం పంపిస్తున్నారు. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇలాంటి సమస్య గతంలో ఎన్నడూ లేని ఎదురుకాకపోవడంతో ఆయన స్వయంగా ఓ వీడియో కాన్ఫరెన్స్ సైతం చేపట్టారు. ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తారో చూడాల్సి ఉంది.