చంద్రబాబు నాయుడు గురించి అభిమానులు విజనరీ అని, అపర చాణక్యుడు అని, గిట్టనివారు మీడియా మేనేజర్ అని, మానిప్యులేటర్ అనీ అంటారు. అయితే ఎవరైనా ఒప్పుకునే విషయం ఏమిటంటే ఆయన ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలో అయినా నిబ్బరం కోల్పోకుండా ఉంటారన్నది. ఎన్టీఆర్ ని దించిన ఆగస్టు సంక్షోభం సమయంలో కానీ, తన నాయకత్వంలో విజయం సాధించినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి చేతిలో రెండు సార్లు వరుసగా ఓడిపోయినప్పుడు కానీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాడు. ఓడిపోయినందుకు కృంగిపోకుండా రాబోయే […]
ఇప్పుడు పరిస్థితి మరీ సున్నితమైపోతుంది.ఒక నీటి ప్రాజెక్ట్ ప్రకటించగానే విమర్శల జడివాన కురుస్తుంది…దిగువ రాష్ట్రం ఏ ప్రాజెక్ట్ చేపట్టిన ఎగువ రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్పటం సహజమైపోయింది…రాజకీయ పక్షాలు – ఏ సమస్య అయినా రాజకీయ కోణంలోనే ఆరోపణలుచేస్తున్నాయి. విషయంలోకి వెళ్లి పరిశీలించి, సాంకేతిక అంశాలు తరచి చూసి,గత అనుభవాలు,వాదనలను తెలుసుకొని మాట్లాడే పద్దతి ఇప్పుడు లేదు. పోతిరెడ్డిపాడుతో వివాదం ఏంటి? పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి […]
విశాఖ ఘటనపై విచారణకు టిడిపి ఎమ్మెల్యేల బృందం నియామకం ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను ఏది మాట్లాడితేఅదే గొప్ప అనుకుంటారు. తాను సర్వజ్ఞుడిని అని భ్రమల్లో ఉంటుంటారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థలో విష వాయువులు లీకైన ఘటన అనంతరం తనను ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీసం సంప్రదించలేదని, అన్నీ ఐఏఎస్ అధికారులతోనే మాట్లాడారని చంద్రబాబు తెగ ఫీలయ్యారు..అసలు ఐఏఎస్ అధికారులకు ఏమి తెలీదని,వాళ్ళతో రివ్యూలు పెట్టడం పెద్ద దండగ అని బాబు వాకృచ్చారు. తనకన్నా […]
తల్లికి బిడ్డ చేసే సేవ.. తాతకు మనవడు అందించే సపర్యలు ఎప్పుడూ ఆత్మీయమైనవే. వయస్సులో చిన్నవారి నుంచి వాళ్ళు సేవలు కోరుకోక పోయినప్పటికీ అందించాల్సిన బాధ్యత అందరి పైనా ఉంటుంది. అందులోనూ ప్రజల బాగు కోసం అహర్నిశలూ శ్రమించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ బాధ్యతను అన్ని వేళలా నెరవేరుస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడే కాదు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఏమాత్రం భేషజానికి పోకుండా పెద్దలపై తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. వారి పట్ల […]
విశాఖ ఎల్జి పాలిమర్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. సమీక్ష తర్వాత మీడియా తో మాట్లాడారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి 25 వేల రూపాయల చొప్పున, ఆస్పత్రిలో రెండు మూడు రోజుల పాటు ఉండి వైద్యం తీసుకున్న వారికి లక్ష రూపాయల చొప్పున, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకొన్న వారికి పది లక్షల రూపాయల చొప్పున పరిహారం […]
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. వివిధ అంశాలపై సవివరంగా పది పేజీల 10 పేజీల లేఖను సీఎం జగన్ ప్రధానికి రాశారు. ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేలా పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని కోరారు. ఏపీలో […]
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత్ ను,ఆంధ్రప్రదేశ్ ను తన గుప్పిట్లోకి తీసుకున్నది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలే కరోనా దెబ్బకు విలవిల్లాడుతూ ఏం చేయాలో తెలీక నిరత్తురులవుతున్నాయి. వేలల్లో కేసులు, వందల్లో మరణాలతో ఆయా దేశాలు భీతిల్లుతున్నాయి. దేశవిదేశాల్లోని ప్రధానుకు,రాజులు, మంత్రులు, అధికారులు, సినిమాయాక్టర్లు ఒకరేమిటి ఎందరో ముఖ్యులు ఈ వ్యాధికి గురైనారు.. కొందరు కొలుకున్నారు. ఈ విపత్తునుంచి ఎలా బయటపడాలా అని అన్నివర్గాలు […]
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన లేఖల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన చంద్రబాబు.. తాజాగా ఈ రోజు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వ సమర్థత బయట పడుతుంది. కానీ ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తే కరోనా నియంత్రణ చేతగాక కరోనా తో కలిసి జీవించాలి.. అంటూ […]
ప్రభుత్వం పై ఎప్పటిలానే నిరాధార ఆరోపణలు వెనకా ముందు చూడకుండా తనకు నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడడంలో టిడిపి ఎమ్మేల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ముందుంటారు. గతంలో టిడిపి హయాంలో మంత్రిగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిపక్షం మీద ఇష్టానుసారం విరుచుకుపడేవారు.. అధికారం పోయాక కూడా కొన్నాళ్ళు అదే నోటిదురుసుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద, మంత్రుల మీద కామెంట్స్ చేసేవారు.అయితే ఆ తరువాత ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు విషయంలో ఆయన కార్మికమంత్రిగా […]
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి రూ. 1000 నగదు పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఈ ఉదయం నుంచే గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాలంటీర్లు ఇంటింటికీ వెయ్యి రూపాయలు చొప్పున పంపిణీ చేశారు. దీనితో ఆర్థిక ఇబ్బందుల్లోనూ తమకు అండగా నిలిచిన […]