iDreamPost
android-app
ios-app

తెల్లారేసరికే ఇంటి గుమ్మం దగ్గరికి చేరిన ప్రభుత్వ సహాయం

తెల్లారేసరికే ఇంటి గుమ్మం దగ్గరికి చేరిన ప్రభుత్వ సహాయం

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి రూ. 1000 నగదు పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఈ ఉదయం నుంచే గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాలంటీర్లు ఇంటింటికీ వెయ్యి రూపాయలు చొప్పున పంపిణీ చేశారు.

దీనితో ఆర్థిక ఇబ్బందుల్లోనూ తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి పేదలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీంతో కోటి 30 లక్షల కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందనుంది. కాగా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే లాక్‌డౌన్‌ వల్ల పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. పేదలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా బియ్యం, కందిపప్పుతోపాటు ఒక్కో కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1,000 చొప్పున నగదు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే మొదటి విడతగా గత నెల 29 నుంచి పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. కాగా నేడు బియ్యం కార్డులున్న 1.30 కోట్ల కుటుంబాలకు ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా వెయ్యి రుపాయలు చొప్పున నగదు సాయం అందిస్తున్నారు. దీనిలో భాగంగా అన్నీ జిల్లాలకు కలిపి షుమారు 1300 కోట్ల రుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది