iDreamPost
iDreamPost
తల్లికి బిడ్డ చేసే సేవ.. తాతకు మనవడు అందించే సపర్యలు ఎప్పుడూ ఆత్మీయమైనవే. వయస్సులో చిన్నవారి నుంచి వాళ్ళు సేవలు కోరుకోక పోయినప్పటికీ అందించాల్సిన బాధ్యత అందరి పైనా ఉంటుంది. అందులోనూ ప్రజల బాగు కోసం అహర్నిశలూ శ్రమించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ బాధ్యతను అన్ని వేళలా నెరవేరుస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడే కాదు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఏమాత్రం భేషజానికి పోకుండా పెద్దలపై తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. వారి పట్ల వాత్సల్యం చూపుతున్నారు.
ఒక వ్యక్తికి మనసా, వాచా, కర్మేణ ఆ భావన ఉంటే తప్ప ఎదుటి వ్యక్తిపై ఆత్మీయ స్పందన సాధ్యం కాదు. ప్రజల పట్ల సీఎం జగన్ కు ఉన్న ప్రేమ విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు మరోమారు తేటతెల్లమైంది. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి పట్ల తానెంత బాధ్యతగా వుంటానో మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాటిచెప్పారు. కుటుంబ సభ్యులు సైతం ముట్టుకునేందుకు వెనుకాడే తీవ్రమైన చర్మవ్యాధి గ్రస్తులను సైతం అనేక మందిని ఆప్యాయంగా తడిమి వారికి జీవితం మీద ఆశని కల్పించిన సంగతి రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అప్పుడు ఆయన చేసిన పనిని ప్రత్యర్ధులు సంకుచిత కళ్ళతో విమర్శలు కూడా చేశారు. ఆ కువిమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఇప్పుడు కూడా అధికార దర్పం తనను తాకదని, అవసరార్ధులకు తానెప్పుడూ అండే అని చాటిచెప్పారు.
స్టైరిన్ గ్యాస్ కారణంగా అస్వస్థతకు గురైన ఒక వృద్ధుడు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అక్కడకు సీఎం హోదాలో వెళ్లిన జగన్ ఆ పెద్దాయన్ను పరామర్శిస్తుండగా ఆయన కూర్చోలేక, పడుకునేందుకు వరుగుతుండగా ఆ పెద్దాయన కాళ్ళను జగన్ స్వయంగా పట్టుకుని పడుకునేందుకు సహాయపడ్డారు. ఈ సంఘటన చూసిన వాళ్లకు జగన్ వ్యక్తిత్వంపై మరింత ఉన్నతాభిప్రాయం కలగక మానదు.
గెలిస్తేనే సరిపోదు.. తనను గెలిపించిన వాళ్ళ కష్టం, నష్టం తీర్చడంలో ఒక కొడుగ్గా, అన్నగా, తమ్ముడిగా, మనవడిగా తోడుండాలి. సరిగ్గా సీఎం జగన్ అదే చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా నేను తోడు ఉంటాను అన్న భరోసా కల్పిస్తున్నారు. అందుకే ప్రజా సేవకుడా నీకు వందనం.