దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్రం ఈ నెల 15న జారీచేసిన లాక్డౌన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా కేరళ ప్రభుత్వం కొన్ని సడలింపు ఇవ్వటంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.కేంద్రం హెచ్చరికలతో లాక్డౌన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇచ్చిన మినహాయింపులపై కేరళ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టామ్ జోస్తో సమావేశమై కేంద్ర అభ్యంతరాలపై చర్చించారు. తాజాగా రెస్టారెంట్లు, బార్బర్ షాపులు తెరవడం, ఇంటర్ సిటీ బస్సు సర్వీసులు […]
లాక్ డౌన్ మద్యం ప్రియుల పాలిట శాపంగా మారింది. చుక్క వేయనిదే రోజు ప్రారంభం కానీ వారికి, రోజు ముగియని వారికి చుక్కలు చూపిస్తోంది. నిత్యావసరాలు, కూరగాయలు, మందుల దుకాణాలు మినహా మిగతా అన్ని వ్యాపార, వ్యవహారాలకు లాక్ డౌన్ వర్తిస్తోంది. ఫలితంగా మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు మందు ను కూడా నిత్యావసర వస్తువుల జాబితాలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది మత్తు దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. మానసిక వైద్యశాలలు […]
కరోనా వైరస్ విషయంలో మొదట్లో కేంద్రప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే జనాల కొంపముంచుతోందా ? అంటే అవననే సమాధానం వస్తోంది అందరి దగ్గర నుండి. ఒకసారి కాస్త చరిత్రను చూస్తే కేంద్ర నిర్లక్ష్యం స్పష్టంగా అర్ధమవుతుంది. అప్పట్లోనే కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే జనాలు ఇపుడింత అవస్తలు పడాల్సిన అవసరం ఉండేది కాదేమో అని అనిపిస్తోంది. ఇంతకీ కేంద్రం నిర్లక్ష్యం ఏమిటి ? ఏమిటంటే చైనాలోని వూహాన్ లో మొదటి కేసు బయటపడింది 2019, డిసెంబర్ 31వ తేదీన. […]
దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎన్ ఆర్ ఐలు ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దాంతో ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అనేక అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా దేశంలోనే తొలి కేసు ఆ రాష్ట్రంలో నమోదయ్యింది. జనవరి 30నాడు దేశమంతా ఉలిక్కిపడేలా కరోనా కేసు నమోదు కావడంతో కలకలం రేగింది. అయితే వెంటనే అప్రమత్తమయిన కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. కేవలం ఎన్ ఆర్ ఐలు, ఇతర ఉన్నత స్థాయి వారినే కాకుండా సామాన్య, వలస […]
మానవ జాతికి కరోనా పెను ముప్పుగా పరిణమించింది. ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా కరోనా మారింది. ప్రపంచ దేశాలు తమ మధ్య ఉన్న మనస్పర్థలు, వివాదాలను పక్కనపెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. కరోనాను అంతం చేసేందుకు చేతులు కలుపుతున్నాయి. దేశాలే కాదు మన దేశంలో ఓ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆ రాష్ట్రం ఏదో కాదు.. కేరళ. కరోనా వైరస్ కేరళలో ముఖ్యమంత్రి పినయి విజయన్, ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలను కలిపింది. కరోనా మహమ్మరిని […]
ప్రపంచంలోని అనేక దేశాలతో పాటుగా భారతదేశంలో కూడా అంచనాలకు భిన్నంగా కరోనా విస్తృతమవుతోంది. ముందస్తు చర్యలతో ప్రభుత్వం స్పందిస్తోంది. వివిధ చర్యలకు పూనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం సహా ఆలయాల్లో భక్తుల రాకపోకలు నిలిపివేశారు. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఇతర వ్యాపార, వాణిజ్య కూడళ్లలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. సిబ్బందికి తగిన రీతిలో జాగ్రత్తలు సూచించింది. ఇక […]