iDreamPost

మ్యాచ్ అయ్యాక కావ్య మాటలు వింటే హ్యాట్సాఫ్ అంటారు! స్పీచ్ వైరల్!

SunRisers Hyderabad- Kavya Maran Great Speech: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 అట్టహాసంగా ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కప్పు కొట్టింది. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మాత్రం హృదయాలు గెలిచారు. అదే విషయాన్ని ఓనర్ కావ్య మారన్ చెప్పుకొచ్చింది.

SunRisers Hyderabad- Kavya Maran Great Speech: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 అట్టహాసంగా ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కప్పు కొట్టింది. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మాత్రం హృదయాలు గెలిచారు. అదే విషయాన్ని ఓనర్ కావ్య మారన్ చెప్పుకొచ్చింది.

మ్యాచ్ అయ్యాక కావ్య మాటలు వింటే హ్యాట్సాఫ్ అంటారు! స్పీచ్ వైరల్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ అట్టహాసంగా ముగిసింది. కింగ్ ఖాన్ కి చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్స్ వరకు వెళ్లి.. ఆఖరి అడుగులో తడబడింది. అయినా గానీ.. అభిమానులు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలిచారు. గతేడాది టేబుల్ లీస్ట్ పొజీషన్లో నిలిచిన సన్ రైజర్స్ జట్టు ఇప్పుడు.. ఏకంగా రన్నరప్ గా నిలవడం మామూలు విజయం కాదు. అదే విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కో ఓనర్ కావ్య మారన్ కూడా తెలియజేసింది. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లను కలిసి వారితో మాట్లాడింది. వారిలో స్ఫూర్తిని నింపింది. ఆమె స్పీచ్ వింటే మీరు హ్యాట్సాఫ్ అనేస్తారు.

కావ్య మారన్.. ఈ పేరు తెలియని ఇండియన్ క్రికెట్ అభిమానులు ఉండరేమో? ఐపీఎల్ ఫాలో అయ్యే వారికి కావ్య మారన్ కచ్చితంగా తెలిసే ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఉందంటే.. స్టేడియంలో కావ్య కచ్చితంగా ఉంటుంది. ప్రతి బాల్, ప్రతి షాట్, ప్రతి వికెట్ కు కావ్య ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్, ఆమె ఆనందం, ఆమె బాధ ఇలా ప్రతి ఒకటి కెమెరామ్యాన్ క్యాప్చర్ చేస్తూనే ఉంటాడు. ఐపీఎల్ చూసే వారికి కావ్య పాప ఎంత సెన్సిటివ్ అనేది బాగా తెలుసు. ఊరికే ఎమోషనల్ అయిపోతుంది. ఫైనల్స్ లో గ్రౌండ్ లోనే ఏడ్చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. అయితే మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కావ్య ఇచ్చిన స్పీచ్ కి అంతా ఫిదా అయిపోయారు. కావ్య ఇంత మెచ్యూర్డ్ గా ఉంటుందా అని షాకవుతున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతో కావ్య మాట్లాడుతూ.. “మీరంతా మమ్మల్ని నిజంగా గర్వ పడేలా చేశారు. ఆ విషయాన్ని చెప్పేందుకు నేనే స్వయంగా వచ్చాను. మీరు టీ20 క్రికెట్ స్వరూపాన్నే మార్చేశారు. టీ20 క్రికెట్ కు కొత్త అర్థాన్ని చెప్పారు. ఇప్పుడు అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా మీరు చాలా బాగా ఆడారు. మీరు బాల్ తో, బ్యాట్ తో అద్భుతం చేశారు. గతేడాది మనం టేబుల్ లీస్ట్ పొజిషన్ తో సరిపెట్టుకున్నాం. కానీ మన మీద ఉన్న నమ్మకంతోనే ఈసారి కూడా ఎంతో మంది స్టేడియానికి వచ్చారు. అందరూ ఇప్పుడు మన గురించే మాట్లాడుకుంటున్నారు. కేకేఆర్ కప్పు గెలిచింది. కానీ, మనం ఆడిన స్టైల్ ఆఫ్ క్రికెట్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. మీరు చాలా రాణించారు. ఇలా డల్ గా మాత్రం ఉండద్దు. ఇలా అస్సలు ఉండద్దు. మీరు చాలా బాగా ఆడారు” అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లలో కావ్య మారన్ స్ఫూర్తిని నింపింది. వారి ప్రతిభను, వారి కృషిని పర్సనల్ గా వెళ్లి మెచ్చుకుంది. ప్రస్తుతం కావ్య మారన్ స్పీచ్ నెట్టింట వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి