iDreamPost

మరో Bankపై RBI కొరడా.. లైసెన్స్‌ రద్దు.. రూ.91 లక్షల జరిమానా!

నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా మరో బ్యాంకు లైసెన్స్ రద్దు చేసింది. ఆ బ్యాంకుకు ఏకంగా 91 లక్షల జరిమానా విధించింది.

నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా మరో బ్యాంకు లైసెన్స్ రద్దు చేసింది. ఆ బ్యాంకుకు ఏకంగా 91 లక్షల జరిమానా విధించింది.

మరో Bankపై RBI కొరడా.. లైసెన్స్‌ రద్దు.. రూ.91 లక్షల జరిమానా!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు బ్యాంకులకు షాకిస్తున్నది. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిలో వ్వహరిస్తున్న బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తున్నది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ సంచలన నిర్ణయాలతో నియమాలను అతిక్రిమిచే బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతూ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు భారీ స్థాయిలో జరిమానాలను కూడా విదిస్తున్నది. ఇప్పుడు మరో బ్యాంకుపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఏకంగా బ్యాంకు లైసెన్స్ ను రద్దు చేసింది. మరో రెండు బ్యాంకులకు భారీగా ఫైన్ విధించింది. ఇంతకీ ఆ బ్యాంకులు ఏవంటే?

కస్టమర్లకు ఎలాంటి సమస్యలు రాకుండా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే ఓ సహకార బ్యాంకు లైసెన్స్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్ రద్దుకాబడిన సహకార బ్యాంకు యూపీలోని ఘాజీపూర్ లో ఉన్న పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంకు. ఈ బ్యాంకుకు తగినంత మూలధనం, ఆదాయం లేని కారణంగా లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్‌ను మూసివేసి లిక్విడేటర్‌ను నియమించాలని ఉత్తర్‌ప్రదేశ్‌లోని కో-ఆపరేటివ్ కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్‌ను ఆదేశించినట్లు ఆర్‌బిఐ తెలిపింది.

అయితే సహకార బ్యాంక్ లైసెన్స్ రద్దైన నేపథ్యంలో బ్యాంకులో డిపాజిట్ చేసిన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ లోన్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి రూ. 5 లక్షల వరకు మాత్రమే స్వీకరించడానికి అర్హులు. ఇదే సమయంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులైన యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులపై చర్యలు తీసుకుంది ఆర్బీఐ. పలు నిబంధనలు ఉల్లంఘించినందుకు యెస్ బ్యాంక్‌పై రూ.91 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంక్‌పై కోటి రూపాయల జరిమానా విధించారు. యెస్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్, ఖాతాలకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించకుండా అతిక్రమించిందని ఆర్బీఐ ఆరోపించింది. ఇది వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు సహకార బ్యాంకులు, ప్రైవేట్ , ప్రభుత్వ బ్యాంకులపై చర్యలు తీసుకుని భారీగా జరిమానాలు విధించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి