iDreamPost

Pooja Hegde: నాకు ఐడెంటిటీ ఇచ్చిన ఆ ఇండస్ట్రీనే నాకు చాలా స్పెషల్ : పూజ హెగ్దే

  • Published Jun 20, 2024 | 9:15 AMUpdated Jun 20, 2024 | 9:15 AM

తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకున్న భామలు.. అంతే త్వరగా ఇండస్ట్రీ నుంచి క్విట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మడు కూడా అంతే.. అయితే..

తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకున్న భామలు.. అంతే త్వరగా ఇండస్ట్రీ నుంచి క్విట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మడు కూడా అంతే.. అయితే..

  • Published Jun 20, 2024 | 9:15 AMUpdated Jun 20, 2024 | 9:15 AM
Pooja Hegde: నాకు ఐడెంటిటీ ఇచ్చిన ఆ ఇండస్ట్రీనే నాకు చాలా స్పెషల్ : పూజ హెగ్దే

ఒకప్పటితో పోల్చితే .. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది పెర్టిక్యులర్ హీరోయిన్స్ మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది నటి నటులు కేవలం ఒకటి రెండు సినిమాలతోనే.. ఓవర్ నైట్ లో స్టార్ సెలెబ్రిటీలు అయిపోతున్నారు. దీనితో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ రకంగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరోవైపు ఎంత తక్కువ సమయంలో క్రేజ్ సంపాదించుకుంటున్నారో.. అంతే త్వరగా ఇండస్ట్రీ నుంచి క్విట్ అయిపోయేవారు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం.. ఆఫర్లు లేక సైలెంట్ అయిపోతూ ఉంటారు. టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్దే కూడా ఇలానే సైలెంట్ అయిపోయింది. తాజాగా పూజ సినిమాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

రెండేళ్ల క్రితం వరకు కూడా పూజ హెగ్దే టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్. దాదాపు ఆమె నటించిన సినిమాలన్నీ కూడా హిట్ అయ్యాయి. అల్లు అర్జున్ తో కలిసి నటించిన అలా వైకుంఠ పురం సినిమా వరకు ఆమె క్రేజ్ విపరీతంగా నడిచింది. కానీ ఆ తర్వాత ఆమెకు మెల్లగా ఆఫర్లు తగ్గిపోయి.. ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపొయింది ఈ అమ్మడు. దీనితో ఆ సమయంలో అందరిలానే పూజ కూడా తెలుగు సినిమాలను వదిలేసి.. బాలీవుడ్ బాట పట్టింది. కానీ అక్కడ కూడా పూజ పేరు అంతగా వినిపించింది లేదు. ఇక ఇప్పుడు పూజకు ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ఛాన్స్ దక్కినట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఓ హిందీ సినిమాలో కూడా ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది అని టాక్ వినిపిస్తుంది. తెలుగులో పూజ పేరు వినిపించకపోయినా ఇతర భాషలలో మాత్రం ఇప్పుడిప్పుడు బాగానే అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు నెటిజన్లు.

అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పూజ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు దాదాపు అన్ని భాషలలోను నటిస్తున్నారు కదా.. నటిగా మీ ప్రయారిటీ ఏంటి అని ప్రశ్నించగా.. “నటనకు ప్రాంతీయబేధం లేదు. ఏ భాషలోనైనా నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. అయితే.. తెలుగు సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే.. నాకంటూ ఓ గుర్తింపును ఇచ్చింది తెలుగు సినిమానే. నేను ఎన్ని భాషల్లో నటించినా.. తెలుగులో అవకాశం వస్తే మాత్రం కాస్త ఎక్కువ ఆనందిస్తాను. త్వరలో ఓ మంచి సినిమా చేస్తాను”. అంటూ పూజ చెప్పుకొచ్చింది. మరి ఈసారైనా ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు వస్తాయో లేదో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి