iDreamPost

భార్య ఉరిని హ్యాపీగా చూస్తూ ఉండిపోయిన భర్త! OTT లో పిచ్చెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్

  • Published Jun 27, 2024 | 11:46 AMUpdated Jun 27, 2024 | 11:46 AM

OTT Best Suspense Thriller :వారం క్రితం ఓటీటీ లోకి ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. దాదాపు ఓటీటీ లోకి వచ్చిన సినిమాలను వచ్చినట్లు చూసేస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

OTT Best Suspense Thriller :వారం క్రితం ఓటీటీ లోకి ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. దాదాపు ఓటీటీ లోకి వచ్చిన సినిమాలను వచ్చినట్లు చూసేస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 27, 2024 | 11:46 AMUpdated Jun 27, 2024 | 11:46 AM
భార్య ఉరిని హ్యాపీగా చూస్తూ ఉండిపోయిన భర్త! OTT లో పిచ్చెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్

ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కు ఆదరణ బాగా పెరగడంతో.. మేకర్స్ కొత్త పాయింట్స్ తో సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం క్రితం ఓటీటీ లోకి ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి వచ్చింది. దాదాపు వచ్చిన సినిమాలను వచ్చినట్లు చూస్తూనే ఉన్నా కానీ.. ఎక్కడో ఓ దగ్గర ఈ సినిమాలో ఏముంటుందిలే అని లైట్ తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. గతం అనేది అందరికి ఉంటుంది. అలా వేరు వేరు గతాలు ఉన్న ఇద్దరు వేర్వేరు మనుషులు కలిస్తే ఎలా ఉంటుంది. వారి జీవితం ఎలా ముందుకు సాగుతుంది. అనే ప్లాట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ ఓపెన్ చేస్తే.. పరశు అనే ఓ ఇన్సెపెక్టర్ కు తన పై అధికారి నుంచి కాల్ వస్తుంది. అతను చేసిన నేరమేంటో తనకు తెలుసని.. వచ్చి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అవ్వమని చెప్తాడు. ఆయన చెప్పినట్లుగానే పరశు పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. కానీ వెళ్లిన తర్వాత అక్కడ సీన్ అంతా రివర్స్ అవుతుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పరశు అక్కడ పోలీసులకు తెలియకుండా తన పై అధికారిని చంపేసి.. దానిని యాక్సిడెంటల్ డెత్ గా అందరిని నమ్మిస్తాడు. దీనితో ఇప్పుడు తన పై అధికారి ప్లేస్ లోకి పరశు వస్తాడు. చేతికి అధికారం రావడంతో.. తనకింద పని చేసే వారిని టార్చర్ చేస్తూ.. సైకోల బెహేవ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ లో సదా అనే ఓ నాటు వైద్యుడిని చూపిస్తారు. అతను ఓ రోజు బస్ స్టాప్ లో నిలబడి ఉండగా… బస్సులో వెళ్తున్న ఓ అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియకపోయినా తనకు తెలియకపోయినా తనకు దైర్యం చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అతని చేతిపై ఉన్న టాటూని కనిపిస్తుంది.

కొద్దీ రోజుల తర్వాత ఆ బస్సులో చూసిన అమ్మాయిని ఓ రెస్టారెంట్ లో కలుస్తాడు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆమె పేరు సూర్య అని అక్కడ కొత్తగా జాయిన్ అయినా మ్యానేజర్ అని చెప్తుంది. ఫస్ట్ లుక్ లోనే సదా సూర్య ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకి పరశు కూడా వస్తాడు. వీరిద్దరూ మాట్లాడుకోవడం పరశుకు నచ్చదు. కానీ సూర్య , సదా మాత్రం ఒకే ఏరియాలో ఉండడంతో తరచూ కలుస్తూనే ఉంటారు. మరోవైపు పరశు కూడా సూర్యకు దగ్గరవ్వాలని చూస్తాడు. కానీ సూర్య మాత్రం సదాని ఇష్టపడుతుంది.

సూర్య, సదా జీవితాల్లో ఓ గతం ఉందని.. దాని వల్లే అప్పటివరకు వారు అలా ఒంటరిగా ఉన్నారని తెలుస్తోంది. పరశుకు కూడా ఓ గతం ఉంటుంది. అదేంటంటే తన భార్య తన కళ్ళముందే ఉరి వేసుకుని చనిపోతున్నా కూడా.. ఆపకుండా మందు తాగుతూ.. ఆమె మరణాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. అసలు వారి గతాలు ఏంటి ! పరశుకు సదా కు ఏమైనా సంబంధం ఉందా ! సూర్యా సదాతో కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి ! సూర్య , సదా , పరశు ఈ ముగ్గురి జీవితాలు ఎలా ముందుకు సాగుతాయి! అసలు పరశు చేసిన నేరమేంటీ ? ఇవన్నీ తెలియాలంటే రీసెంట్ గా రిలీజ్ అయినా “రసవతి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి