iDreamPost

నితీశ్ ను కావాలనే తప్పించారా? తెలుగోడిపై ఇంత ద్వేషం ఎందుకు?

టీమిండియా యంగ్ సెన్సేషన్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి జింబాబ్వే టూర్ కు ఎంపిక అయ్యి.. గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. అయితే నిజంగానే నితీశ్ కు గాయం అయ్యిందా? లేక కావాలనే తప్పించారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా యంగ్ సెన్సేషన్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి జింబాబ్వే టూర్ కు ఎంపిక అయ్యి.. గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. అయితే నిజంగానే నితీశ్ కు గాయం అయ్యిందా? లేక కావాలనే తప్పించారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

నితీశ్ ను కావాలనే తప్పించారా? తెలుగోడిపై ఇంత ద్వేషం ఎందుకు?

టీమిండియాకు ఆడాలని ప్రతి ఒక్క వర్ధమాన క్రికెటర్ల కల. అయితే ఆ కలను నెరవేర్చుకోవడానికి  ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక్కోసారి అవకాశం వచ్చినట్లు వచ్చి.. చేజారి పోతుంది. ఇంకొన్ని సార్లు దురదృష్టం వెంటాడుతుంది. ఇలాగే ఓ టీమిండియా యంగ్ బ్యాటర్ ను గాయం రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆ యంగ్ ప్లేయర్ మరెవరో కాదు తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి. జింబాబ్వే టూర్ కు ఎంపిక అయ్యాడన్న సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే.. గాయం కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. అయితే నితీశ్ ను కావాలనే తప్పించారా? లేక నిజంగానే గాయం అయ్యిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

నితీశ్ కుమార్ రెడ్డి.. ఐపీఎల్ 2024 సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు కుర్రాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించిన నితీశ్.. తనదైన శైలితో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేవాడు. ఈ సీజన్ లో మిడిలార్డర్ లో  బ్యాటింగ్ కు వచ్చి.. జట్టుకు భారీ స్కోర్లు అందించడంతో పాటుగా టీమ్ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర వహించాడు. ఈ ఐపీఎల్ లో 303 పరుగులు చేసి, అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీకి అతడు ఎంపిక అవుతాడని అందరూ భావించారు. కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో.. ఈసారి ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు.

ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ ను జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేసింది. దాంతో టీమిండియాలోకి రావాలన్న అతడి కల నెరవేరింది అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఓ పిడుగులాంటి వార్త. గాయం కారణంగా జింబాబ్వే టూర్ కు నితీశ్ కుమార్ దూరం అవుతున్నాడని, అతడి స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేను జట్టులోకి తీసుకుంటున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసే గోల్డెన్ ఛాన్స్ ను కోల్పోయాడు.

అయితే కావాలనే నితీశ్ ను జింబాబ్వే టూర్ నుంచి తప్పించారని నెటిజన్లు, కొందరు క్రికెట్ అభిమానులు బీసీసీఐ తీరును విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అతడు ఏ టోర్నీలో ఆడట్లేదని, అలాంటప్పుడు గాయం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే గాయం అయ్యిందా? లేక వేరే కారణాలతో నితీశ్ ను తప్పించారా? తెలుగోడిపై బీసీసీఐకి ఎందుకు ఇంత ద్వేషం అంటూ బీసీసీఐని తిట్టిపోస్తున్నారు. మరి నితీశ్ కుమార్ జింబాబ్వే టూర్ నుంచి వైదొలగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి