iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: కల్కి 2898 AD కంటే ముందు అమితాబ్, కమల్ నటించిన సినిమా ఇదే.. రజనీకాంత్ కూడా..

Amitabh Bachchan and Kamal Haasan మోస్ట్ ఎవటైడ్ మూవీ కల్కి 2898 AD థియేటర్లలో జూన్ 27 నుండి సందడి చేస్తుంది. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో భారీ కాస్టింగ్ ఉన్న సంగతి విదితమే. ఇందులో ది లెజెండ్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పోటా పోటీగా నటించారు. అయితే ఈ మూవీ కన్నా ముందు ఈ ఇద్దరు ఏ సినిమాలో నటించారంటే..?

Amitabh Bachchan and Kamal Haasan మోస్ట్ ఎవటైడ్ మూవీ కల్కి 2898 AD థియేటర్లలో జూన్ 27 నుండి సందడి చేస్తుంది. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో భారీ కాస్టింగ్ ఉన్న సంగతి విదితమే. ఇందులో ది లెజెండ్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పోటా పోటీగా నటించారు. అయితే ఈ మూవీ కన్నా ముందు ఈ ఇద్దరు ఏ సినిమాలో నటించారంటే..?

Kalki 2898 AD: కల్కి 2898 AD కంటే ముందు అమితాబ్, కమల్ నటించిన సినిమా ఇదే.. రజనీకాంత్ కూడా..

భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. జూన్ 26 రాత్రి నుండి ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర హంగామా సృష్టించిన సంగతి విదితమే. ప్రభాస్‌ను స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆత్రుతకు జూన్ 27న తెరపడింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌కు ముడిపెడుతూ విజువల్ వండర్ క్రియేట్ చేశాడు దర్శకుడు. కల్కి మూవీని చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సరికొత్త ప్రభాస్‌ను చూశామంటూ పొంగిపోతున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెస్తూనే..కీ రోల్స్ చేసిన అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్ కాస్ట్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. తొలి సారిగా తెలుగులో ఫుల్ లెంత్త్ రోల్‌లో నటించారు బాలీవుడ్ స్టార్ అమితాబ్.

మనంలో స్మాల్ రోల్ చేసిన అమితాబ్.. ఇందులో అశ్వత్థామ పాత్రలో మెస్మరైజ్ చేశాడు. అలాగే యాస్కిన్ పాత్రలో కమల్ తప్ప మరొకర్ని ఊహించలేరు. అందుకే ఆయన్ను లోక నాయకుడని అంటారు.  ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరు తెలుగు సినిమాతో మరోసారి కలిశారు. సుమారు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించారు ఈ బిగ్గెస్ట్ స్టార్స్. ఈ లెజెండ్స్ యాక్టర్స్ గతంలో కలిసి నటించారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఇందులో మరో అగ్ర హీరో వీరితో నటించాడు. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్ . ఇంతకు ఈ త్రిమూర్తులు నటించిన మూవీ ఏంటంటే.. గేరాఫ్టర్. 1985లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో మన తెలుగు హీరోయిన్ మాధవి నటించడం విశేషం. బప్పీల హరి మ్యూజిక్ అందించగా.. ప్రయాగ్ రాజ్ దర్శకుడు. అప్పట్లో ఈ సినిమా హిట్‌గా నిలిచింది.

ఇందులో అమితాబ్, కమల్ సోదరులుగా నటించారు. కరణ్, కిషన్ పాత్రలను పోషించారు. ఇప్పుడు 39 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ దిగ్గజ నటులు. కల్కి 2898 ఏడీతో కలిశారు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే బిగ్ బీ ఇందులో 81 ఏళ్ల వయస్సులో కూడా అశ్వత్థామ పాత్రలో అల్లాడించాడు. ఇందులో ఆయన ఫెర్మామెన్స్‌కు ఫిదా కాని వారుండరు. లెజెండ్ యాక్టర్ ఊరికనే అయిపోరని మరోసారి నిరూపించాడు అమితాాబ్. ఇక కమల్ హాసన్ సైతం నెగిటివ్ రోల్ చేసినా.. కట్టిపడేశారు. ఆయన ఓ ప్రపంచాన్ని సృష్టించి.. దాన్ని ఏలుతుంటారు. వీరితో పాటు ఈ మూవీలో భారీ కాస్టింగ్ ఉంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, మృణాళిని ఠాకూర్, అనుదీప్, ఫరియా, అవసరాల శ్రీనివాస్, రామ్ గోపాల్ వర్మ వంటి స్టార్స్ నటించారు.