iDreamPost
android-app
ios-app

సెమీస్‌కి ముందు ఆ వేస్ట్ ప్లేయర్‌ను తప్పిస్తున్న రోహిత్‌? ఇది ఎప్పుడో చేయాల్సింది!

  • Published Jun 27, 2024 | 12:59 PM Updated Updated Jun 27, 2024 | 12:59 PM

Ravindra Jadeja, IND vs ENG, T20 World Cup 2024: ఇంగ్లండ్‌తో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా రెడీ అవుతుంది. అయితే.. ఈ మ్యాచ్‌ కోసం ఓ వేస్ట్‌ ప్లేయర్‌ను పక్కనపెట్టేందుకు రోహిత్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Ravindra Jadeja, IND vs ENG, T20 World Cup 2024: ఇంగ్లండ్‌తో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా రెడీ అవుతుంది. అయితే.. ఈ మ్యాచ్‌ కోసం ఓ వేస్ట్‌ ప్లేయర్‌ను పక్కనపెట్టేందుకు రోహిత్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 27, 2024 | 12:59 PMUpdated Jun 27, 2024 | 12:59 PM
సెమీస్‌కి ముందు ఆ వేస్ట్  ప్లేయర్‌ను తప్పిస్తున్న రోహిత్‌? ఇది ఎప్పుడో చేయాల్సింది!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా నేడు(గురువారం) సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. గయానా వేదికగా పటిష్టమైన ఇంగ్లండ్‌తో తలపడనుంది రోహిత్‌ సేన. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఇంగ్లండ్‌తోనే జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఓటమికి ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ అండ్‌ కో కసిగా ఉంది. అయితే.. ఈ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచి.. సౌతాఫ్రికాతో టైటిల్‌ పోరుకు సిద్ధం కావాలంటే.. సెమీస్‌లో పటిష్టమైన టీమ్‌తో బరిలోకి దిగాలని కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ కూడా బలంగా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. అందుకోసం ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఒక మార్పు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో చెత్త ఫామ్‌తో జట్టుకు భారంగా మారిన ఓ సీనియర్‌ ప్లేయర్‌ను పక్కనపెట్టి.. అతని ప్లేస్‌లో అగ్రెసివ్‌ యంగ్‌ ప్లేయర్‌ను టీమ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ టీమ్‌లో ప్రస్తుతం ఉన్న ఆ వేస్ట్‌ ప్లేయర్‌ ఎవరంటే రవీంద్ర జడేజా. వేస్ట్‌ ప్లేయర్‌ అని ఎందుకు అంటున్నాం అంటే.. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో జట్టుకు జడేజా ఏం మాత్రం ఉపయోగపడటం లేదు. యూజ్‌ లెస్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో ఐర్లాండ్‌తో టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లో జడేజాకు బ్యాటింగ్‌ రాలేదు, బౌలింగ్‌లో కేవలం ఒక్క ఓవర్‌ వేసి 7 రన్స్‌ ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు.

ఇక పసికూన అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అయితే.. జడేజాకు బ్యాటింగ్‌ రాలేదు, అలాగని అతనికి బౌలింగ్‌ కూడా ఇవ్వలేదు. టీమ్‌లో నిరుపయోగంగా ఉన్నాడు. కెనడాతో జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక సూపర్‌ 8లో ఆఫ్ఘాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 7 పరుగులు, బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 20 పరుగులు ఒక్క వికెట్‌ పడగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజాకు బ్యాటింగ్‌ రాలేదు, బౌలింగ్‌లో 3 ఓవర్లలో 24 రన్స్‌ ఇచ్చి.. ఒక్క వికెట్‌ తీయలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్‌లో 9 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. బౌలింగ్‌లో ఒక్క ఓవర్‌లోనే 17 పరుగులు సమర్పించుకుని ఎక్స్‌పెన్సీగా మారాడు. ఇలా ఈ టోర్నీలో జడేజా చెత్త ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లో ప్లస్‌ దక్కించుకున్న జడేజా.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అస్సలు రాణించడం లేదు. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన జడేజా ఒక వికెట్‌ తీసి, 22 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా జట్టుకు భారంగా మారిన జడేజాను తప్పించి.. అతని ప్లేస్‌లో సంజు శాంసన్‌ను తీసుకోవాలని రోహిత్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరి జడేజాను పక్కనపెట్టనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.