iDreamPost

‘కల్కి’ ఫస్ట్ డే కలెక్షన్లు.. RRR రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమేనా?

సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ప్రభాస్ కల్కి మూవీ.. తొలిరోజు ఎంత రాబడుతుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా? అన్నదానిపై పరిశ్రమలో జోరుగా చర్చనడుస్తోంది. మరి ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వసూళ్ చేస్తుందో ఓసారి పరిశీలిద్దాం.

సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ప్రభాస్ కల్కి మూవీ.. తొలిరోజు ఎంత రాబడుతుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా? అన్నదానిపై పరిశ్రమలో జోరుగా చర్చనడుస్తోంది. మరి ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వసూళ్ చేస్తుందో ఓసారి పరిశీలిద్దాం.

‘కల్కి’ ఫస్ట్ డే కలెక్షన్లు.. RRR రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమేనా?

‘కల్కి 2898 ఏడీ’ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన మూవీ థియేటర్లలోకి వచ్చింది. నేడు (జూన్ 27న) వరల్డ్ వైడ్  గా రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఓవర్సీస్ లో అయితే రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను బద్దలు కొట్టింది ‘కల్కి’. దాంతో విడుదల అయ్యాక ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో అంటూ ఫ్యాన్స్ తో పాటుగా సినీ పండితులు వేచి చూశారు. ఈ నేపథ్యంలో కల్కి తొలి రోజు ఎంత రాబడుతుందో అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆ అంచనాల ప్రకారం కల్కి ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్మురేపిన ఈ చిత్రం.. విడుదలైన తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కల్కి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ మూవీ వస్తోంది అంటే చాలు.. రికార్డులకు ఒకపక్క వణుకు పుడుతుంది. ఆ విషయం ఇప్పటికే రుజువైంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన చిత్రాల్లో టాప్-5లో నాలుగు ప్రభాస్ మూవీలో ఉండటం విశేషం.

తొలిరోజు అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్(రూ. 223 కోట్లు), బాహుబలి 2(రూ. 215 కోట్లు), సలార్(రూ.170 కోట్లు), ఆదిపురుష్(రూ. 140 కోట్లు), సాహో(రూ. 130 కోట్లు) చిత్రాలు టాప్ 5లో ఉన్నాయి. ఇక ఇప్పుడు కల్కి మూవీ టాప్ 3లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ చిత్రం తొలిరోజు దాదాపు రూ. 205 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రాంతంతో సంబంధం లేకుండా.. అడ్వాన్స్ బుకింగ్స్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఫస్ట్ డేలోనే 200 కోట్లు కొల్లగొడుతుందని సినీ పండితులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తే.. ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి కల్కి మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి