iDreamPost

సెమీస్ లో ఓటమి.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రషీద్ ఖాన్!

టీ20 వరల్డ్ కప్ లో ప్రారంభం నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆఫ్గానిస్తాన్.. సెమీస్ లో సౌతాఫ్రికా చేతిలో కంగుతిన్నది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రషీద్ ఖాన్ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో ప్రారంభం నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆఫ్గానిస్తాన్.. సెమీస్ లో సౌతాఫ్రికా చేతిలో కంగుతిన్నది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రషీద్ ఖాన్ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సెమీస్ లో ఓటమి.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రషీద్ ఖాన్!

టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ పోరాట యోధుల కథ ముగిసింది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనతో సెమీ ఫైనల్ కు దూసుకొచ్చిన ఆ టీమ్.. కీలక మ్యాచ్ లో దారుణంగా విఫలం అయ్యింది. అసలు ఆఫ్గాన్ టీమేనా ఇలాంటి చెత్త ఆట ఆడింది? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. సెమీస్ లో 56 పరుగులకే ఆలౌట్ అయ్యి.. సఫారీ టీమ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇక ఈ ఓటమికి కారణాలు చెబుతూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశాడు కెప్టెన్ రషీద్ ఖాన్.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ దారుణంగా ఓటమి పాలైంది. టోర్నీ ప్రారంభం నుంచి అద్భుతంగా రాణించిన బ్యాటర్లు ఈ మ్యాచ్ లో పూర్తిగా చేతులెత్తేశారు. దాంతో 56 రన్స్ కే కుప్పకూలింది ఆఫ్గాన్ టీమ్. ఇక ఈ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ రషీద్ ఖాన్. ఈ క్రమంలో కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

“ఈ రోజు మాకు ఎంతో కఠినమైన రోజు. ఈ మ్యాచ్ లో కంటే మేము మెరుగైన ప్రదర్శన చేయగలం. కానీ మాకు పరిస్థితులు అనుకూలించలేదు. సెమీస్ లో ఓడిపోవడం ఎంతో బాధగా ఉంది. మా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం. అయితే సౌతాఫ్రికాతో సెమీస్ ఆడే స్థాయి వరకు వచ్చామని, బలమైన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయామని అంగీకరిస్తాం. ఇది మాకు ఆరంభం మాత్రమే. కానీ ఏ జట్టును అయినా ఓడిస్తామనే నమ్మకం మాకు వచ్చింది. ఆ నమ్మకంతోనే భవిష్యత్ లో మరింత ముందుకు సాగుతాం. మాకు అండగా నిలబడిన ఆఫ్గాన్ ప్రజలకు ధన్యవాదాలు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు రషీద్ ఖాన్. ఇక రాబోయే కాలంలో బ్యాటింగ్ పై మరింత ఫోకస్ పెడతామని, బలమైన ప్రత్యర్థిగా తిరిగొస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ఆఫ్గాన్ కెప్టెన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి