iDreamPost

Kalki 2898 AD: కల్కి సూపర్ హిట్ కాగానే.. ఆ పాత చెప్పులు పోస్ట్ చేసిన నాగ్ అశ్విన్! కారణం?

  • Published Jun 27, 2024 | 12:29 PMUpdated Jun 27, 2024 | 12:29 PM

ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న కల్కి సినిమా నేడు అనగా జూన్‌ 27 న రిలీజ్‌ అయ్యింది. అయితే మూవీ విడుదల రోజు కల్కి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు. .

ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న కల్కి సినిమా నేడు అనగా జూన్‌ 27 న రిలీజ్‌ అయ్యింది. అయితే మూవీ విడుదల రోజు కల్కి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు. .

  • Published Jun 27, 2024 | 12:29 PMUpdated Jun 27, 2024 | 12:29 PM
Kalki 2898 AD: కల్కి సూపర్ హిట్ కాగానే.. ఆ పాత చెప్పులు పోస్ట్ చేసిన నాగ్ అశ్విన్! కారణం?

పురాణాలకు లింక్‌ పెడుతూ.. యుగాంతాన్ని చూపిస్తూ.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ కల్కి 2898 ఏడీ. సుమారు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. నేడు అనగా గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక థియేటర్లలో కల్కి ప్రభంజనం సృష్టిస్తోంది. సూపర్‌ హిట్టు టాక్‌ తెచ్చుకుని.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించడానికి రెడీ అవుతోంది. గురువారం తెల్లవారుజాము నుంచే కల్కి థియేటర్లలో సందడి చేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు విజువల్‌ వండర్‌.. నాగ్‌ అశ్విన్‌ థింకింగ్‌ వేరే లెవల్‌.. ఇండియన్‌ సినిమా సత్తా మరోసారి చాటారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందు కల్కి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కల్కి, నాగ్‌ అశ్విన్‌ పేర్లే మార్మోగుతున్నాయి. ఒక్క సినిమాతో నాగ్‌ అశ్విన్‌ పేరు హాలీవుడ్‌ స్థాయికి చేరింది అంటున్నారు. ఈయన తన కెరీర్‌లో తీసింది 3 సినిమాలు మాత్రమే. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, ఇప్పుడు కల్కి. మహానటి జాతీయ అవార్డు దక్కించుకోగా.. కల్కి.. సినీ ప్రపంచంలో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతోంది. ఇక కల్కి విడుదల నాడు అనగా నేడు నాగ్‌ అశ్విన్‌.. తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో తెగ వైరల్‌ అవుతోంది. పాత అరిగిపోయిన చెప్పుల ఫొటోని పోస్ట్‌ చేయడం సంచలనంగా మారింది.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన కల్కి రచ్చే కనిపిస్తోంది. ఇదే ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ పోస్ట్‌ చేసిన ఫొటో మరింత వైరల్‌గా మారింది. సినిమా విడుదల రోజు ఈ పాత చెప్పుల ఫొటోను ఎందుకు పోస్ట్‌ చేశాడని చర్చించుకుంటున్నారు. పూర్తిగా అరిగిపోయి.. అక్కడక్కడ ఊడిపోయి ఉన్న తన పాత చెప్పుల ఫొటోను పోస్ట్‌ చేశాడు నాగ్‌ అశ్విన్‌. దీనితో పాటు.. ఇక్కడి దాకా రావడానికి చాలా దూరం నడిచా.. అనే అర్థం వచ్చే క్యాప్షన్‌ పోస్ట్‌ చేశాడు. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి అంటున్నారు నెటిజనులు. ఈ ఫొటో కల్కితో నాగ్‌ అశ్విన్‌ నాలుగేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేయగా.. మరోటి 4 వేల రూపాయల జీతం నుంచి.. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కించే స్థాయికి చేరుకున్నాడు అనే విషయాన్ని కూడా తెలుపుతున్నట్లు ఉంది అంటున్నారు నెటిజనులు.

అంటే కల్కి ప్రయాణం మొదలైన నాటి నుంచి నేడు సినిమా రిలీజ్‌ అయ్యే వరకు నాగ్‌ అశ్విన్‌ ఒక్క జత చెప్పులను ధరించాడని.. ఇది ఆయన డెడికేషన్‌ను చూపిస్తుంది అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కిస్తున్నప్పటికి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా.. ఎంతో సింపుల్‌గా ఉండటం నాగ్‌ అశ్విన్‌కే చెల్లింది. ఇప్పుడు ఆయన డెడికేషన్‌కు తగ్గ ఫలితం దక్కింది అంటున్నారు నెటిజనులు. ఇటీవల విడుదలైన ప్రీ లూడ్‌ వీడియోలోనూ.. కల్కి చిత్రం కోసం 5 ఏళ్లు కష్టపడ్డట్లు నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. దాని ఫలితమే ఇది అన్నట్లుగా పాత చెప్పులను పోస్ట్‌ చేశాడంటున్నారు నెటిజనులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి