iDreamPost

కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?

  • Published Jun 27, 2024 | 1:10 PMUpdated Jun 27, 2024 | 1:10 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. కాగా, ఈ మూవీ నేడు దేశవ్యాప్తంగా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించిన విషయం తెలిసిందే. మరి ఈ మూవీని బడ్జెట్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలో ఇప్పుడు తెలసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. కాగా, ఈ మూవీ నేడు దేశవ్యాప్తంగా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించిన విషయం తెలిసిందే. మరి ఈ మూవీని బడ్జెట్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలో ఇప్పుడు తెలసుకుందాం.

  • Published Jun 27, 2024 | 1:10 PMUpdated Jun 27, 2024 | 1:10 PM
కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత  కలెక్ట్ చేయాలో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’. కాగా, ఈ మూవీ నేడు అనగా జూన్ 27వ తేదీ గురువారం నేడు దేశవ్యాప్తంగా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమలహాసన్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన వంటి స్టార్లు నటించారు. అయితే భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా నేడు తెల్లవారుజాము నుంచే షోలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే కల్కి మూవీ మంచి హిట్ టాక్ అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా దూససుకుపోతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పడతున్నారు. ముఖ్యంగా బ్లాక్ లో కూడా టికెట్స్ కొనుగొలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కల్కి సినిమా తెలుగు,హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీని సుమారు రూ.రూ.600కోట్ల బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే కల్కి సినిమాకు థియేట్రికల్ బిజినెస్ లెక్కల ప్రకారం.. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.395 కోట్ల షేర్ అంటే సుమారు రూ.800కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి.ఆ గ్రాస్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్ దాటేసినట్టే. అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ బట్టి చూస్తే.. ఒకవేళ అంతకు మించి గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా కల్కి2898 ఏడీ సినిమా దాదాపు రూ. 1000 కోట్ల మార్క్ సులువుగా దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే.. ఇప్పటికే హిట్ టాక్ తో వరల్డ్ వైడ్ గా కల్కి ఫీవర్ వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కల్కి సినిమా రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సిని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ డే రూ.200 కోట్ల మార్క్ దాటేస్తుందని లెక్కలు కడుతున్నారు.మరి, ట్రేడ్ నిపుణులు మేరకు కల్కి మూవీ రూ.200 కోట్లు గ్రాస్ వస్తుందా.. ఆ టార్గెట్ ను క్రాస్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. మరి, ప్రభాస్ కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి