iDreamPost

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జిని చూడాలనుకుంటున్నారా.. ఆ థియేటర్ కు వెళ్లండి

  • Published Jun 27, 2024 | 1:02 PMUpdated Jun 27, 2024 | 1:02 PM

నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ నేడు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ మంచి హిట్ టాక్ ను అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇక ఈ కల్కి సినిమాలో భైరవ బుజ్జి పాత్ర ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ప్రభాస్ బుజ్జిని కలవాలి అనుకుంటే వెంటనే ఆ థియేటర్ కు వెళ్లండి.

ఎట్టకేలకు ఎన్నో రోజులుగా అందరూ ఎదరు చూస్తున్న రోజులు ఫలించాయి. ఎప్పుడెప్పుడ అని ఎంతో ఆత్రుతుగా చూసిన రోజు రానే వచ్చేసింది. ముఖ్యంగా మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నేడు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు నాగ్ ఆశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా, కల్కి మూవీ నేడు అనగా జూన్ 27వ తేదీ గురువారం తెల్లవారు జాము నుంచే షోలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే డార్లింగ్ అభిమానులు ఈ సినిమా గురించి అర్థరాత్రి నుంచే థియేటర్ల బాట పట్టి తెగ హంగామ చేశారు. ఇక మొదటిరోజే కల్కి సినిమా మంచి హిట్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసేందుకు బ్లాక్ లో కూడా టికెట్స్ కొనుగోలు చేస్తుననారు.

ఇదిలా ఉంటే..ప్రభాస్ కల్కి సినిమాలో భైరవ బుజ్జి పాత్ర కూడా కీలకమైనదే. ముఖ్యంగా ఇటీవలే మూవీ మేకర్స్ బుజ్జిని పరిచయం కూడా చేశారు. అంతేకాకుండా.. ఈ బుజ్జీ కోసం భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించారు.అలాగే గత కొన్ని రోజులుగా కల్కి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భైరవ బుజ్జి సోషల్ మీడియాలో బుజ్జీ ఎంతలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో కూడా ఈ బుజ్జిని తిప్పుతూ ప్రచారాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలతా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జి ఇండియాలోని అన్ని ప్రాంతాలను చుట్టుముట్టు ఇప్పుడు చివరికి హైదరాబాద్ కు చేరింది. ఈ క్రమంలోనే నేడు కల్కి మూవీ విడుదతల సందర్భంగా బుజ్జిని ప్రత్యేక పదర్శనలో పెట్టారు. ఇంతకి ఎక్కడంటే..

ప్రభాస్ కల్కి సినిమాలో భైరవ బుజ్జి ఇప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ బుజ్జిని నేడు కల్కి మూవీ సందర్భంగా ప్రసాద్స్ మ‌ల్టీప్లెక్స్ నిర్వ‌హాకులు ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. ఇక బుజ్జిని చూసేందుకు ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ కూడా ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌కు ఎగబ‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే బుజ్జిని మీరు కూడా కలవలని అనుకుంటే వెంటనే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వెళ్లి సందర్శించవచ్చు. ఇకపోతే కల్కి సినిమాలో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమలహాసన్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన వంటి స్టార్లు నటించారు. మరి, కల్కి భైరవ బుజ్జిని హైదరాబాద్ లోని ప్రత్యేక ప్రదర్శనగా ఉంచడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి