iDreamPost

దేశం కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా.. OTTలో బెస్ట్ జవాన్ స్టోరీ!

OTT Movie Suggestions- Best Action Drama Aiyaary: దేశభక్తి, ఆర్మీ బ్యాగ్రౌండ్, యాక్షన్ సీక్వెన్సులు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఈ మూవీకి ఇష్టపడటానికి. ఒక్కో సీన్ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. సినిమా చూశాక మీరు వారి దేశభక్తికి సెల్యూట్ చేస్తారు.

OTT Movie Suggestions- Best Action Drama Aiyaary: దేశభక్తి, ఆర్మీ బ్యాగ్రౌండ్, యాక్షన్ సీక్వెన్సులు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఈ మూవీకి ఇష్టపడటానికి. ఒక్కో సీన్ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. సినిమా చూశాక మీరు వారి దేశభక్తికి సెల్యూట్ చేస్తారు.

దేశం కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా.. OTTలో బెస్ట్ జవాన్ స్టోరీ!

మనం ఎన్ని సినిమాలు చూసినా.. ఎన్ని కథలు చూసినా కూడా ఒక దేశభక్తి సినిమా చూస్తే మనసు భలే సంతోషంగా ఉంటుంది. అలాంటి దేశ భక్తి సినిమా కూడా జవాన్లు, ఆర్మీ, సీక్రెట్ ఆపరేషన్ వంటి ఎలిమెంట్స్ చుట్టూ తిరిగేది అయితే మాత్రం తప్పకుండా ఆ ఫీల్ వేరే ఉంటుంది. అలాంటి ఒక పక్కా దేశభక్తితో కూడిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీ చూసిన తర్వాత మీరు కచ్చితంగా వావ్ అంటారు. అంతేకాకుండా ఈ మూవీలో ఉండే యాక్టర్స్ కు, వారి యాక్టింగ్ కి మీరు సెల్యూట్ చేస్తారు. ఒక్కొక్కరు వారి బెస్ట్ ఇచ్చారు. పైగా ఇందులో చాలానే పెద్ద పెద్ద యాక్టర్స్ వారి యాక్టింగ్ తో ఇరగదీశారు.

ఈ సినిమా మొత్తం దేశం, ఆర్మీ, ఒక గురువు- శిష్యుడు మధ్య జరుగుతూ ఉంటుంది. మనదేశంలో పెద్ద ఎత్తున ఏదో ఒక కుట్ర జరుగుతూ ఉంటుంది. ఆ కుట్రకు సంబంధించి ఎవరికీ ఎలాంటి సమాచారం ఉండదు. కానీ, మన హీరో మాత్రం ఆ కుట్రను భగ్నం చేయడానికి ఎవరికీ తెలియకుండా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అసలు అతను అలాంటి పని చేయబోతున్నాడు అనే విషయం వాళ్ల గురువు(మనోజ్ బాజ్ పాయూ)కి కూడా తెలియదు. అప్పటి వరకు ఒక మంచి శిష్యుడిగా ఉంటూ.. తన గురువు దగ్గర చాలానే విషయాలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత వ్యవస్థకే ఎదురెళ్తాడు. ఒక్కడిని కంట్టడి చేయడం కోసం మనోజ్ భాజ్ పాయీ టీమ్ మొత్తం తెగ కష్టపడుతుంది.

Airaay

అలాంటి ఒక నిర్ణయం తీసుకునే సమయంలో కూడా తన గురువు దగ్గరే సలహా తీసుకుంటాడు. అయితే అసలు అతను ఎందుకు అడుగుతున్నాడో తెలియకుండా సలహా కూడా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కథ అసలు మలుపులు తిరుగుతుంది. తన శిష్యుడు, తన దగ్గర నేర్చుకున్నవాడు వ్యవస్థకు ఎదురెళ్లడాన్ని మనోజ్ బాజ్ పేయీ తీసుకోలేకపోతాడు. అందుకే అతడిని తానే పట్టుకోవాలి అని ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఎలాగైనా సిద్ధార్థ్ మల్హోత్రాని పట్టుకుని తీరతాను అంటూ శపథం చేస్తాడు.

అలా వారి మధ్య ఒక చిన్న యుద్ధమే స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్లిద్దరు కాంప్రమైజ్ అయ్యారా? తన శిష్యుడి గురించి తెలుసు కాబట్టి.. గురువే అతని దారిలోకి వెళ్లాడా? అసలు ఈ ఆపరేషన్ లో సిద్ధార్థ్ మల్హోత్రా చిక్కుతాడా? దేశాన్ని రక్షించాలి అనే అతని సంకల్పం సక్సెస్ అయ్యిందా? అనేదే పాయింట్ ఇంకా ఈ సినిమాలో చాలామంది దిగ్గజాలు ఉన్నారు. నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్, అడిల్ హుస్సేన్, రకూల్ ప్రీత్ సింగ్, పూజా చోప్రాలు కూడా ఉన్నారు. ఈ సినిమా పేరు అయ్యారే(Aiyaary). ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి