iDreamPost

Kalki 2898 AD: “కల్కి 2898” టైటిల్ లో.. 2898 అర్థం ఏమిటి? ఆ నెంబర్ మాత్రమే ఎందుకు పెట్టారంటే?

  • Published Jun 27, 2024 | 1:46 PMUpdated Jun 27, 2024 | 1:46 PM

కల్కి 2898 ఏడీ సినిమా రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. హిట్టు టాకు తెచ్చుకుని.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ క్రమంలో కల్కి 2898లో ఈ నంబర్‌ అర్థం ఏంటో తెలుసుకోవడం కోసం జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆ వివరాలు మీ కోసం

కల్కి 2898 ఏడీ సినిమా రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. హిట్టు టాకు తెచ్చుకుని.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ క్రమంలో కల్కి 2898లో ఈ నంబర్‌ అర్థం ఏంటో తెలుసుకోవడం కోసం జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆ వివరాలు మీ కోసం

  • Published Jun 27, 2024 | 1:46 PMUpdated Jun 27, 2024 | 1:46 PM
Kalki 2898 AD: “కల్కి 2898” టైటిల్ లో.. 2898 అర్థం ఏమిటి? ఆ నెంబర్ మాత్రమే ఎందుకు పెట్టారంటే?

కల్కి 2898 ఏడీ.. గత నెల రోజులుగా ఈ పేరు దేశాన్ని ఉపేస్తుంది. సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకోనే, శోభన, దిశా పటానీ వంటి భారీ స్టార్స్‌తో తెరకెక్కిన కల్కి సినిమా నేడు థియేటర్లలో బాక్సాఫీసుల వద్ద మోత మోగిస్తోంది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచే కల్కి బెనిఫిట్‌ షోలు పడ్డాయి. డార్లింగ్‌ ప్రభాస్‌ నటిస్తోన్న సినిమా కావడం.. పైగా దీనికి నాగ్‌ అశ్విన్‌ లాంటి డైరెక్టర్‌ కావడంతో కల్కి మీద అంచనాలు పెరుగుతూ పోయాయి.

అందుకు తగ్గట్టుగానే మొదటి షో నుంచే కల్కి.. బ్లాక్‌ బాస్టర్‌ హిట్టు టాక్‌ తెచ్చుకుని.. సరికొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేసే దిశగా పరుగులు తీస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి పేరు కనిపిస్తోంది, వినిపిస్తోంది. కల్కి ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో కల్కి పక్కన ఉన్న 2898 ఏడీ అనే నంబర్‌కు అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు నెటిజనులు. మరి 2898 నంబర్‌ ఏంటి.. దీనికి కల్కికి ఉన్న సంబంధం ఏంటి అంటే..

2898 అర్థం ఏమిటి..

హిందూ పురాణాల ప్రకారం.. కలియుగం 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఇక కలియుగంలో ధర్మం తప్పి.. అధర్మం పాలన సాగిస్తున్న వేళ.. ఏ నిమిషయంలో అయినా సరే.. శ్రీమహావిష్ణువు పదో అవతారం అయిన కల్కి వచ్చి.. ధర్మ సంస్థాపన చేస్తాడని పురాణాల్లో వర్ణించారు. ఇక పురాణాల ప్రకారం కలియుగం 4 లక్షలకు పైగా సంవత్సరాలు ఉంటే.. ఇప్పుడు వచ్చిన కల్కి చిత్రంలో దర్శకుడు ఎందుకు 2898 అనే సంవత్సరాన్ని ఎంచుకున్నాడు.. అందుకు గల కారణం ఏంటి అంటే.. పురాణాలు, వ్యాస భారతం ప్రకారం చూసుకుంటే కలియుగం ప్రారంభం అయ్యి ఇప్పటికి 5126 సంవత్సరాలు. 5 వేల ఏళ్ల ముందు భారత చరిత్రలో కురుక్షేత్రం, ద్వాపరయుగం ముగింపు, కలియుగం ఆరంభం జరిగింది. వ్యాసమహాభారతం, పురణాల ప్రకారం మహా భారత యుద్ధం జరిగింది 3138 బీసీఈ సంవత్సరంలో.

అయితే యుద్ధంలో కౌరవులు మరణించి.. పాండవులు విజయం సాధించారు. యుద్ధం ముగిసిన రాత్రి నిద్రపోతున్న ఉపపాండవులును అశ్వత్థామ నిర్ధాక్షిణ్యంగా సంహరించాడు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి అని తెలిసి కూడా.. బ్రహ్మాస్త్రం ప్రయోగించడంతో.. ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా మరణిస్తాడు. దాంతో ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3 వేల ఏళ్ల పాటు దుర్గందంతో తిరుగుతూ ఉంటావని ఆ తర్వాత చిరంజీవిగా ఉంటావని శాపం, వరం ఇచ్చాడు.

ఇదే సమయంలో యుద్ధంలో దుర్యోదనుడు మరణించడంతో.. తీవ్ర ఆవేదనకు గురైన అతడి తల్లి గాంధారి.. శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. ఆయన తల్చుకుంటే యుద్ధం జరిగేది కాదని.. అయినా శ్రీకృష్ణుడు ఆ పని చేయలేదని.. అందువల్ల తన 100 మంది కుమారులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతటితో ఆగక యుద్ధం ముగిసిన 36 ఏళ్ల తర్వాత కృష్ణుడి వంశం నాశనం అవుతుందని శపిస్తుంది. అంటే గాంధారి శాపం ప్రకారం 36 ఏళ్ల తర్వాత.. అనగా 3102 బీసీఈలో కృష్ణావతారం ముగిసి.. కలియుగం ప్రారంభం అవుతుందని వ్యాస భారతంలో చెప్పారు.

3102, 2898ఏడీకి సంబంధం ఇదే..

ఇ​క నాగ్‌ అశ్విన్‌ కల్కి సినిమాలో ఉన్న 2898 ఏడీకి, కలియుగం ప్రారంభమైన 3102 రెండింటిని కలిపితే 6 వేల ఏళ్లు అవుతుంది. అప్పుడు అంటే 2898లో కలియుగాంతం సమీపిస్తోంది. ఆ సమయంలో భూమ్మీద ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీమహావిష్ణువు పదో అవతారం అయిన కల్కి భూమ్మీద జన్మిస్తాడని.. దీని ఆధారంగానే నాగ్‌ అశ్విన్‌ కల్కి 2898 ఏడీని తెరకెక్కించారు అంటున్నారు. అంటే కలియుగం ప్రారంభమైన సంవత్సరం 3102.. ఇప్పుడు కల్కిలో చూపించిన సంవత్సరం 2898.. ఈ రెండింటిని కలిపితే అప్పటికి 6 వేల ఏళ్లు అవుతుంది. అంటే 2898లో కలియుగం అంతం అవుతుంది. శ్రీ మహావిష్ణువు పదో అవతారం అయిన కలి ఈ భూమ్మీదకు వస్తాడు. అదే ఈ 2898 వెనక ఉన్న రహస్యం.

కల్కి పురాణంలో ఏం చెప్పారంటే..

పురాణాల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో స్పష్టంగా వివరించారు. అలానే కల్కి పురాణంలో కూడా కలియుగం ఆరంభమైన 6 వేళ ఏళ్ల తరవాత భూమ్మీద భయంకర పరిస్థితులు తలెత్తుతాయని.. నదులు ఎండిపోతాయని.. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని.. విషమేఘాలు వల్ల చాలా మంది బాధపడతారని.. మరీ ముఖ్యంగా గంగా నది పూర్తిగా ఎండిపోవడంతో.. భూమ్మీద బతకలేని పరిస్థితులు వస్తాయని కల్కి పురాణంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు విడుదలైన కల్కి సినిమాలో కూడా అదే చూపించారు. అంటే కలియుగం ప్రారంభమైన 6 వేల సంవత్స్రాల తర్వాత.. భూమ్మీద ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయో వివరించారు. అంటే నాగ్‌ అశ్విన్‌ ప్రకారం చూసుకుంటే.. 2898 సంవత్సరంలో యుగాంతం సంభవించబోతుందని అర్థం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి