Somesekhar
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం కాదని, కెప్టెన్ రషీద్ ఖానే అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి వారు ఇలా అనడానికి కారణం ఏంటి?
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం కాదని, కెప్టెన్ రషీద్ ఖానే అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి వారు ఇలా అనడానికి కారణం ఏంటి?
Somesekhar
ప్రపంచ కప్ గెలవాలని క్రికెట్ ఆడే ప్రతీ ఒక్క టీమ్ కలలు కంటూ ఉంటుంది. అయితే దానికి కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో పాటుగా ఆటగాళ్లు అందరూ సమష్టిగా రాణించాలి. అప్పుడే తమ నిరీక్షణ ఫలిస్తుంది. ఇక తమ కల తీరడానికి వచ్చిన ఏ చిన్న ఛాన్స్ కూడా వదులుకోవడానికి ఏ జట్టూ కూడా సిద్ధపడదు. అలాంటిది తొలిసారి వరల్డ్ కప్ సెమీస్ కు వచ్చిన ఆఫ్గానిస్తాన్ జట్టు.. కెప్టెన్ రషీద్ ఖాన్ చేసిన తప్పు వల్లే ఓడిపోయింది అంటున్నారు క్రికెటర్ లవర్స్. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 56 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమి మూటగట్టుకున్న ఆఫ్గాన్.. తమ వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లుకుంది. మరి నిజంగా రషీద్ ఖాన్ వల్లే ఆఫ్గాన్ ఓడిపోయిందా? తెలుసుకుందాం పదండి.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గాన్-సౌతాఫ్రికా మధ్య జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ.. వార్ వన్ సైడ్ అయ్యింది. సఫారీ బౌలర్ల ధాటికి కేవలం 56 రన్స్ కే కుప్పకూలింది ఆఫ్గాన్ టీమ్. ఆ చిన్న టార్గెట్ ను కేవలం 8.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి దంచికొట్టింది ప్రోటీస్ జట్టు. దాంతో తొలిసారి ఫైనల్ కు చేరి.. చోకర్స్ అన్న ముద్రను తుడిపేసుకుంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ అంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అలా ఎందుకు అంటున్నారంటే?
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదే అతడు చేసిన పెద్ద తప్పుగా చెప్పుకొస్తున్నారు నెటిజన్లు. సూపర్ 8 మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేసి విజయం సాధించింది ఆఫ్గాన్. ఇక ఈ మ్యాచ్ లో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేయాలని భావించింది. కానీ ఇక్కడే ఓ విషయం రషీద్ ఖాన్ మర్చిపోయాడు. అదేంటంటే? ట్రినిడాడ్ పిచ్ పై గత మూడు మ్యాచ్ ల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే అద్భుత విజయాలు అందుకున్నాయి. ఈ లెక్కలను రషీద్ మర్చిపోయినట్లున్నాడు. అందుకే టాస్ పడగానే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని పెద్ద తప్పు చేశాడని, రషీద్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే ఆఫ్గాన్ చేజేతులా ఓడిపోయిందని క్రికెట్ లవర్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.