iDreamPost

Kalki 2898 AD: మూడు సినిమాలతో మొనగాడైన నాగ్‌ అశ్విన్‌ సక్సెస్‌ జర్నీ! లవ్ స్టోరీ అదుర్స్!

  • Published Jun 27, 2024 | 3:52 PMUpdated Jun 27, 2024 | 3:52 PM

Nag Ashwin: కల్కి సినిమా విడుదలయ్యింది. బాక్సాఫీస్‌ వద్ద మోత మోగిస్తోంది. మీడియా, సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా నాగ్‌ అశ్విన్‌ పేరే వినిపిస్తోంది. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ వ్యక్తిగత జీవితం, లవ్‌ స్టోరీ వివరాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Nag Ashwin: కల్కి సినిమా విడుదలయ్యింది. బాక్సాఫీస్‌ వద్ద మోత మోగిస్తోంది. మీడియా, సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా నాగ్‌ అశ్విన్‌ పేరే వినిపిస్తోంది. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ వ్యక్తిగత జీవితం, లవ్‌ స్టోరీ వివరాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

  • Published Jun 27, 2024 | 3:52 PMUpdated Jun 27, 2024 | 3:52 PM
Kalki 2898 AD: మూడు సినిమాలతో మొనగాడైన నాగ్‌ అశ్విన్‌ సక్సెస్‌ జర్నీ! లవ్ స్టోరీ అదుర్స్!

నేడు దేశంలో మీడియా, సోషల్‌ మీడియాలో వినిపిస్తోన్న పేర్లు రెండే రెండు. ఒకటి కల్కి 2898 ఏడీ అయితే.. మరో పేరు ఆ సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఇప్పటికి చేసింది కల్కితో కలుపుకుని మూడు సినిమాలు మాత్రమే. కానీ తీసిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యంలా నిలిచిపోయింది. ఎవడే సుబ్రహ్మణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సినిమా చూసిన వాళ్లు.. ఎవరీ దర్శకుడు.. చాలా డిఫరెంట్‌గా సినిమాతో వచ్చాడు అనే ఆసక్తిని క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత మహానటితో మంచి విజయం, గుర్తింపు మాత్రమే కాక.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కల్కి సినిమాతో.. అంతర్జాతీయ స్థాయిలో రాణించబోతున్నాడు. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ కెరీర్‌ ప్రారంభం, ప్రియాంక దత్‌తో ప్రేమ, పెళ్లి.. అనే అంశాల గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.

నాగ్‌ అశ్విన్‌ విషయానికి వస్తే.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతుల సంతానం. ఆయన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తరవాత మాస్‌ కమ్యూనికేషన్స్‌, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. ఇక నాగ్‌ అశ్విన్‌ కుటుంబంలో అందరూ డాక్టర్లే. కానీ వారికి భిన్నంగా నాగ్‌ మాత్రం.. సినిమాల మీద ఆసక్తి కనబరిచాడు. దాంతో మణిపాల్‌లో మల్టీమీడియా కోర్సులో చేరాడు. అక్కడ వీడియో ఎడిటింగ్‌తో పాటు సినిమా మేకింగ్‌కు అవసరమైన నాలెడ్జ్‌ను పెంచుకున్నాడు.

శేఖర్‌ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా..

ఆ తర్వాత డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల వద్ద అసిసెంస్ట్‌ డైరెక్టర్‌గా చేరడానికి వెళ్లాడు. ఆయన గోదావరి సినిమా తర్వాత అవకాశం ఇస్తాను అన్నాడు. ఈమధ్యలో మంచు మనోజ్‌గా హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో రెమ్యూనరేషన్‌గా 4 వేల రూపాయలు అందుకున్నాడు. ఇక శేఖర్‌ కమ్ముల మాట ఇచ్చినట్లే.. తన తర్వాత సినిమాలు లీడర్‌, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం కల్పించాడు. అలా శేఖర్‌ కమ్ముల వద్ద నేర్చుకున్న విద్యతో ముందుగా యాదోం కీ బరాత్‌ అనే ఇంగ్లీష్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఒకటి డైరెక్ట్‌ చేశాడు నాగ్‌ అశ్విన్‌. దీనికి ప్రియాంక దత్‌ నిర్మాత కావడం విశేషం. ఈ సినిమా కేన్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కార్నర్‌ కోసం సెలక్ట్‌ అయ్యింది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌.. నాగ్‌ అశ్విన్‌ కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది.

యాదోం కీ బరాత్‌ షార్ట్‌ఫిల్మ్‌ వల్ల నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్నలతో నాగ్‌ అశ్విన్‌కి పరిచయం ఏర్పడింది. అతడి టాలెంట్‌ని గుర్తించిన ప్రియాంక, స్వప్న దత్‌లు.. నాగ్‌కు సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి ‘ఎవడే సుబ్రమణ్యం’ కథను వినిపించాడు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట​ ఇచ్చారు. అలా నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్‌ అశ్విన్‌ తొలి సినిమా వెండితెరపై మెరిసింది. ఈ సినిమాకు మంచి మార్కులు పడటమే కాక.. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా దక్కింది. ఇదే సమయంలో ఆయన పలు యాడ్స్‌ డైరెక్ట్‌ చేశాడు.

ప్రియాంక దత్‌తో ప్రేమ, పెళ్లి..

ఇక ప్రముఖ డైరెక్టర్‌ అశ్వినీ దత్‌ కుమార్తె అయిన ప్రియాంక దత్‌.. తన 21వ యేట 2004లో పవన్‌ కల్యాణ్‌ ‘బాలు’ చిత్రం ద్వారా కోప్రోడ్యూసర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘శక్తి’ చిత్రాన్ని కూడా ఆమె నిర్మించింది. త్రీ ఏంజల్స్ స్టుడియో స్థాపించి.. సారొచ్చారు, బాణం, ఓం శాంతి, యాదోంకీ బరత్ వంటి చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. సినిమాలతో పాటు కొన్ని యాడ్స్‌ కూడా ప్రొడ్యూస్‌ చేశారు. ఆ సమయంలోనే ఆమెకు నాగ్‌ అశ్విన్‌ పరిచయం కావడం.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాదోంకీ బరత్ అనే లఘు చిత్రం కోసం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది.

ఈ క్రమంలో ప్రియాంక దత్‌కు తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో నాగ్‌ అశ్విన్‌ ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాడు. ‘మీకు ఎవరైనా నచ్చితే సరే… లేదంటే మనం పెళ్లి చేసుకుందాం’ అని ప్రియాంకతో చెప్పినట్లు.. నాగ్‌ అశ్విన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అప్పటికే చాలా కాలంగా నాగ్ అశ్విన్‌తో ఆమె ట్రావెల్ చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో వారి పెళ్లి 2015లో జరిగింది.

అలా దర్శకుడుగా నాగ్ అశ్విన్ మంచి విజయం సాధించకముందే అతన్ని ఆమె నమ్మారు. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్‌-ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి