iDreamPost

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు క్రేజ్ మాములుగా లేదు

  • Published Jun 27, 2024 | 3:48 PMUpdated Jun 27, 2024 | 3:48 PM

Pic Talk: పై ఫోటోలో రెండు జడలతో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమెకు తెలుగులో ఓ పాపులర్ సీరియల్ లో హీరోయిన్ గా అలరిస్తుంది. పైగా ఈమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..

Pic Talk: పై ఫోటోలో రెండు జడలతో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమెకు తెలుగులో ఓ పాపులర్ సీరియల్ లో హీరోయిన్ గా అలరిస్తుంది. పైగా ఈమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..

  • Published Jun 27, 2024 | 3:48 PMUpdated Jun 27, 2024 | 3:48 PM
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు క్రేజ్ మాములుగా లేదు

వెండితెరపై మెరిసే తారలంటే ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కానీ,ఇప్పుడు బుల్లితెరపై మెరిసే అందాల బామలకు కూడా ఫుల్ క్రేజ్ తో పాటు భారీ స్థాయిలో అభిమానులు ఉంటున్నారు. ముఖ్యంగా ఒకనొక కాలంలో సిల్వర్ స్క్రీన్ పై అలరించే తారలకే ఎక్కువగా క్రేజ్ ఉండేంది. కానీ, ఇప్పుడు బుల్లితెరపై మెప్పించే బ్యూటీలకు కూడా ఆడియాన్స్ లో క్రేజ్ మామోలుగా లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం వెండితెరపై మెరిసే తారలకంటే.. తామేమి తక్కువ కాదంటూ.. దూసుకుపోతున్నారు వెండితెర తారలు. కేవలం నటనలోనే కాదు.. గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా.. తమ టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా బుల్లితెరపై  పరభాష నటీ,నటులే ఎక్కువగా అలరిస్తున్నారు.  ముఖ్యంగా  కన్నడ, తమిళ ఇండస్ట్రీకి చెందిన తారలే ఎక్కువగా సీరియల్స్ లో హీరోయిన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తమదైన నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నా ఓ బుల్లితెర హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో ఓ పాపులర్ సీరియల్లో హీరోయిన్ గా అలరిస్తుంది. పైగా ఈ చిన్నది బుల్లితెర పై పలు రియాల్టీ షోలలో కూడా పాల్గొంటూ.. తనదైన కామెడీ టైమింగ్ తో పంచులు వేస్తూ అదరగొట్టేస్తుంది. ముఖ్యంగా వచ్చి రాని తెలుగులో ఆ అమ్మాయి మాట్లాడే మాటలు వింటే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. ఇప్పటికే ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టే ఉంటారు. ఆమె మరెవరో కాదు.. బ్రహ్మముడి ఫేమ్ కావ్య అలియాస్ ‘దీపికా రంగరాజు’.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈమె త్వరలోనే అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. దీపికా రంగరాజు తమిళంలో పలు సీరియల్స్ లో చేసింది. ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇక దీపిక ఈ సీరియల్ లో తన నటనతో, అమాయకత్వంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇకపోతే ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్స్ బెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో టాప్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్లో కావ్య పాత్ర ద్వారా తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను దగ్గరైన దీపికను ఇప్పుడు అందరూ తమ కుటుంబసభ్యురాలిగా చూస్తున్నారు.

ఇక ఈ సీరియల్ ద్వారా కాకుండా స్టార్ మా నిర్వహించే పలు రియాల్టీ షోలలో దీపికా చేసే అల్లరి మాములుగా ఉండదు. అయితే తాజాగా ఈ చిన్నదానికి సంబంధించి కొన్ని ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, అందులో దీపిక తన పాత ఫోటోలతోపాటు కొత్త ఫోటోలను కంపేర్ చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది దీపిక.ఇక అందులో కావ్య చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటోలో దీపికను చూస్తే అసలు గుర్తుపట్టాలేము. ఎందుకంటే.. ఆ ఫోటోలో రెండు జడలతో బూరీ బుగ్గలతో ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది దీపిక.అయితే ఈ ఫోటో కాస్త వైరల్ కావడంతో.. దీపిక చిన్నప్పుడు భలే ముద్దుగా ఉందంటూ నెటిజన్స్,ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి,ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీపిక చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి