iDreamPost

Kalki 2898 AD OTT: కల్కి OTT రిలీజ్ లో చిన్న ట్విస్ట్.. ఎవరు ఊహించి ఉండరు !

  • Published Jun 27, 2024 | 2:41 PMUpdated Jun 27, 2024 | 2:41 PM

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు నుంచి సినీ ప్రపంచంలో కల్కి మ్యానియా కొనసాగనుంది. అయితే అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా... రిలీజ్ రోజు ఓటీటీ బజ్ కామన్ అయిపోయింది. ఇప్పుడు కల్కి సినిమా ఓటీటీ లో మాత్రం చిన్న ట్విస్ట్.

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు నుంచి సినీ ప్రపంచంలో కల్కి మ్యానియా కొనసాగనుంది. అయితే అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా... రిలీజ్ రోజు ఓటీటీ బజ్ కామన్ అయిపోయింది. ఇప్పుడు కల్కి సినిమా ఓటీటీ లో మాత్రం చిన్న ట్విస్ట్.

  • Published Jun 27, 2024 | 2:41 PMUpdated Jun 27, 2024 | 2:41 PM
Kalki 2898 AD OTT: కల్కి OTT రిలీజ్ లో చిన్న ట్విస్ట్.. ఎవరు ఊహించి ఉండరు !

అది భారీ బడ్జెట్ సినిమా అయినా లో బడ్జెట్ సినిమా అయినా సరే.. ఆ సినిమా రిలీజ్ అయినా రోజే ఓటీటీ బజ్ అనేది ఇప్పడు కామన్ అయిపొయింది. ఇక ప్రస్తుతం థియేటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా “కల్కి 2898 AD”. కొన్ని నెలల నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కు ముందు వరకు కూడా ఈ సినిమాపై అభిమానులకు రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వచ్చాయి . ఇక ఈరోజు థియేటర్ లో రిలీజ్ అయినా తరువాత ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉందని.. యునానిమస్ టాక్ వినిపిస్తుంది. ఈరోజు నుంచి సినీ ప్రపంచంలో కల్కి మ్యానియా కొనసాగనుంది. ఇక ఇప్పుడు కల్కి సినిమా ఓటీటీ కి సంబంధించి మాత్రం ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకొనే , కమల్ హాసన్ లతో పాటు ఇంకా ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీలు.. ఈ సినిమాలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. నాగ్ అశ్విన్ సైలెంట్ గా తన సత్తా ఏంటో చూపించేసి.. కల్కి సినిమాతో సినీ ప్రపంచాన్ని మరో లెవెల్ కు తీసుకుని వెళ్లాడని.. ఈ సినిమా చూసిన ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇక థియేటర్ లో ఎలాగూ కొన్ని వారాలా పాటు కల్కి మ్యానియా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కల్కి ఓటీటీ పార్ట్నర్ విషయానికొస్తే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఒకే సినిమా రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కావడం అనేది కామన్. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త డిఫ్ఫరెంట్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నాయి.

అయితే నెట్ ఫ్లిక్స్ కేవలం కల్కి సినిమా హిందీ వెర్షన్ రైట్స్ ను మాత్రమే కొనుగోలు చేసిందట. ఈ విషయాన్నీ హిందీ వెర్షన్ స్క్రీన్స్ లో తమ ఓటీటీ ప్లాట్ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ అని చిత్ర బృందం ప్రకటించింది. సుమారు రూ. 175 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఈ డీల్ ను కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇక కల్కి సినిమా తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నాలుగు భాషల డీల్స్ ను సుమారు రూ. 200 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఆల్రెడీ సినిమా రిలీజ్ కు ముందే.. ఓటీటీ లో బుజ్జి అండ్ భైరవ పేరుతో రిలీజ్ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాగూ ఈ సినిమా ఇప్పట్లో థియేటర్స్ ను వదిలి ఓటీటీ కి వచ్చే అవకాశం లేదు కాబట్టి.. నాగ్ అశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచాన్ని.. విజువల్స్ తో చేసిన మ్యాజిక్ ను ఎంచక్కా థియేటర్స్ కు వెళ్ళి చూసేయండి. మరి కల్కి సినిమా ఓటీటీ బజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి