iDreamPost

చికిత్సకు డబ్బుల్లేక దీన స్థితిలో కమెడియన్.. శింబు సాయం

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు తమ నటనతో కితకితలు పెట్టించారు. కేవలం తెలుగు హాస్య నటుల్నే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్స్ ను కూడా ఆదరించారు. వారిలో ఒకరు వెంగళ రావ్. కోలీవుడ్ సినిమాల్లో ఎక్కువ నటించారు. తెలుగులో కూడా పలు చిత్రాల్లో చేశారు. ఇప్పుడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు తమ నటనతో కితకితలు పెట్టించారు. కేవలం తెలుగు హాస్య నటుల్నే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్స్ ను కూడా ఆదరించారు. వారిలో ఒకరు వెంగళ రావ్. కోలీవుడ్ సినిమాల్లో ఎక్కువ నటించారు. తెలుగులో కూడా పలు చిత్రాల్లో చేశారు. ఇప్పుడు

చికిత్సకు డబ్బుల్లేక దీన స్థితిలో కమెడియన్.. శింబు సాయం

ఏ సినిమాలో అయినా కథ, కథనం ఎంత ముఖ్యమో కామెడీ కూడా అంతే అవసరం. అందుకే ఎంత యాక్షన్ చిత్రాల్లో అయినా హాస్య సన్నివేశాలు ఉండేలా ప్లాన్ చేసేవారు దర్శక నిర్మాతలు. ఇండస్ట్రీలో ఏ పాత్ర అయినా తేలికగా చేయొచ్చు కానీ.. కామెడీ పండించాలంటే చాలా కష్టమని అంటుంటారు. ఒకప్పటి రేలంగి నుండి నేటి సత్య వరకు ఎంతో మంది హాస్య నటులు కడుపుబ్బా నవ్వించారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్, అల్లరి నరేష్ వంటి హీరోలు సైతం కామెడీ సినిమాలతోనే పాపులర్ అయ్యారు. అంతేనా జంథ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఎస్ వి కృష్ణా రెడ్డి వంటి దర్శకులు హాస్య కథా చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. టాలీవుడ్ హాస్య నటుల్నే కాదు.. కోలీవుడ్ డబ్బింగ్ చిత్రాలతో కూడా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు వారికి సుపరిచితమయ్యారు.

అయితే సినిమాల్లోలా వీరి లైఫ్ చాలా హాయిగా సాగిపోతుందని అనుకుంటే పొరపాటే. తెరపై అన్ని సినిమాల్లో వీరే కనిపిస్తున్నారు.. భారీగా సంపాదిస్తున్నారనుకుంటున్నారు. కానీ వీరి రీల్ లైఫ్ వేరు.. రియల్ లైఫ్ వేరు. ఎంతో మంది నటీనటులు తక్కువ రెమ్యునరేషన్‌తో బతుకుతుంటారు. మరికొంత మంది డబ్బులు ఉన్నప్పటికీ.. సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఆ తర్వాత కాలంలో సమస్యలను ఎదుర్కొంటారు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇప్పుడో స్టార్ కమెడియన్.. ఇటువంటి ఇబ్బందులతో సతమతమౌతున్నాడు. అతడే కోలీవుడ్ స్టార్ కమెడియన్ వెంగళ్ రావు. వడివేలుతో కలిసి జోడీగా నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరి కాంబోకు మంచి పేరు వచ్చింది. ఆయన తెలుగు వ్యక్తి కావడం విశేషం.

ప్రస్తుతం ఆయన ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించాడు వెంగళ్ రావు. అయితే ఇటీవల ఆయన సినిమాలో నటించలేదు. కొన్నాళ్లుగా వడివేలు సినిమాల్లో నటించకుండా నిషేధం విధించిన నేపథ్యంలో వెంగళ్ రావు కూడా ఆచూకీ లేకుండా పోయాడు. ప్రస్తుతం ఆయన స్వస్థలం ఏపీలోని విజయవాడలో ఉంటున్నాడు. తాజాగా తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి వీడియోలో పేర్కొన్నాడు. చేయి, కాలు పనిచేయడం లేదని, చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక.. ఇబ్బంది పడుతున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు ఆర్థిక సాయం చేయాలని వేడుకున్నాడు. ఈ వీడియోను చూసిన తమిళ స్టార్ నటుడు శింబు.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. కాగా, శింబు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నాడు తమిళ ఆడియన్స్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి