iDreamPost

అక్కడ బతకు కంటే చావే సుఖం.. OTTలో ఈ మూవీకి వణికిపోతారు!

OTT Suggestions- Best Thriller Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత వింటేజ్ మూవీస్ కూడా వైరల్ అవుతున్నాయి. అలాంటి నేపథ్యంలోనే ఈ జెమ్ ఒకటి బయట పడింది. ఈ మూవీని స్టార్ట్ చేస్తే ఆపలేరు. కానీ, కంటిన్యూ చేయాలి అంటే మాత్రం కచ్చితంగా గుండె ధైర్యం ఉండాలి.

OTT Suggestions- Best Thriller Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత వింటేజ్ మూవీస్ కూడా వైరల్ అవుతున్నాయి. అలాంటి నేపథ్యంలోనే ఈ జెమ్ ఒకటి బయట పడింది. ఈ మూవీని స్టార్ట్ చేస్తే ఆపలేరు. కానీ, కంటిన్యూ చేయాలి అంటే మాత్రం కచ్చితంగా గుండె ధైర్యం ఉండాలి.

అక్కడ బతకు కంటే చావే సుఖం.. OTTలో ఈ మూవీకి వణికిపోతారు!

మీకు తెలిసినంత వరకు హాలీవుడ్ లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అలాగే అదే హాలీవుడ్ లో అంతే దారుణమైన చిత్రాలు, భయానక మూవీస్ కూడా వచ్చాయి. అవును మీరు అనుకునేది నిజమే. అద్భుతమైన సినిమాలు కాసేపు పక్కన పెడితే.. భయానక, ఘోరమైన చిత్రాలు చాలానే వచ్చాయి. వాటిని చూడాలి అంటే కచ్చితంగా కాస్త ధైర్యవంతులు అయి ఉండాలి. అలాంటి గుండై ధైర్యం కలిగి వారి కోసం ఒక మంచి సైకో కిల్లర్ సినిమా తీసుకొచ్చాం. ఈ మూవీ చూసిన తర్వాత అబ్బో అని అనకుండా ఉండలేరు. కథ, కాన్సెప్ట్ పక్కన పెడితే ఓవరాల్ గా మీకు అదిరిపోయే ఎక్స్ పీరియన్స్ అయితే లభిస్తుంది.

హాలీవుడ్ నుంచి చాలానే సైకో కిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు గ్లోబల్ లెవల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. కొన్ని మాత్రం ఇప్పటికీ క్లాసిక్ హిట్స్ గా మిగిలిపోయాయి. అలాంటి లిస్ట్ లో ఈ మూవీ సిరీస్ కూడా ఉంటుంది. ఇటీవల కూడా ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త మూవీ వచ్చింది. ఇలా కొన్నేళ్ల నుంచి ఈ మూవీ సిరీస్ నడుస్తోంది. ఇప్పటికీ ఈ సిరీస్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం మీరు చూడలేరు. కనీసం వాటి గురించి ఆలోచించలేరు కూడా. అలాంటి ఒక సినిమా గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే మీకు ఈ మూవీ గురించి తెలిసి ఉండచ్చు. తెలియకపోవచ్చు కూడా.

ఈ సినిమాలో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. అతను ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లి ఒక గదిలో బందిస్తాడు. ఆ గదిలో వారిని చైన్స్ తో కట్టి పడేస్తాడు. ఆ తర్వాత వారికి నరకం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటాడు. వారికి బతకడం కంటే కూడా చావడమే చాలా సుఖం అనిపించేలా చేస్తాడు. వారిని చిత్ర హింసలు పెడుతూ ఉంటాడు. చివరికి బతకడం కోసం ఎవరో ఒకరు చావాలి అనేలా చేస్తాడు. వాళ్లిద్దరిలో ఒకరు ఒకరిని చంపుకునేలా ఉసి గొలుపుతాడు. ఇలా స్టార్ట్ అయిన సినిమా సిరీస్లో దాదాపు 10 మూవీస్ వచ్చాయి. మొదటి పార్ట్ తర్వాత.. ఇంకా చాలానే వైలెన్స్ పెరిగిపోయింది. ఇందులో బాధితులను చేసే చిత్ర హింసలకు ఆడియన్స్ కూడా వణికిపోతారు.

ఒక్కో సీన్ చూసేందుకు కాస్త ఇబ్బందిగా కూడా ఉండచ్చు. అందుకే దీనిని పిల్లలతో చూడొద్దు. అలాగే కొన్ని ఘోరమైన సన్నివేశాలు చూడలేని వాళ్లు కూడా ఈ సినిమాలకి దూరంగా ఉంటే మంచిది. ఈ సినిమా పేరు మరేదో కాదు.. ‘SAW’. ఈ సిరీస్ సినిమాలు ఓటీటీలోనే ఉన్నాయి. కానీ, ఇండియాలో మాత్రం ప్లే చేసేందుకు అనుమతి లేదు. SAW X మాత్రం అమెజాన్ అందుబాటులో ఉంది. కానీ, మీరు లైన్స్ గేట్ కి సబ్ స్క్రిప్షన్ కట్టాలి. లేదంటే 149 రూపాయలకు రెంట్ కి తీసుకోవాలి. అలాగే మీరు యూట్యూబ్ లో కూడా ఈ మూవీని రెంటుకు తీసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ లో డైరెక్ట్ గా సెర్చ్ చేస్తే మీకు కొన్ని సినిమాలు దొరికే ఛాన్స్ కూడా ఉంది. అయితే వీక్ హార్ట్ ఉన్న వాళ్లు మాత్రం ఈ సిరీస్ జోలికి వెళ్లకండి. ఈ మూవీ చూడాలి అనుకుంటే క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి