iDreamPost

Project K Meaning: కల్కి సినిమాలో ప్రాజెక్ట్ K అంటే అర్థం తెలుసా? స్పాయిలర్ లేని వివరణ

Kalki 2898 AD, Project K.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, రూ. 600 కోట్లతో తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. అయితే ఈ సినిమాకు ముందు దీనికి ప్రాజెక్ట్ కే అని పేరు పెట్టారు. ఇంతకు దీని మీనింగ్ ఏంటో తెలిసిపోయింది.

Kalki 2898 AD, Project K.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, రూ. 600 కోట్లతో తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. అయితే ఈ సినిమాకు ముందు దీనికి ప్రాజెక్ట్ కే అని పేరు పెట్టారు. ఇంతకు దీని మీనింగ్ ఏంటో తెలిసిపోయింది.

Project K Meaning:  కల్కి సినిమాలో ప్రాజెక్ట్ K అంటే అర్థం తెలుసా? స్పాయిలర్ లేని వివరణ

మోస్ట్ ప్రెస్టిజీయస్ మూవీ కల్కి 2898 ఏడీ థియేటర్లలోకి వచ్చేసింది. జూన్ 27 నుండి ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యింది. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది వైజయంతి మూవీస్. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ నాగ్ అశ్విన్. కథను డిజైన్ల దగ్గర నుండి క్యారెక్టర్లను తీర్చిదిద్దే వరకు సినిమాను తన భుజాన మోశాడు. నాలుగేళ్ల క్రితం సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఈ కథ ప్రిపేర్ చేయడానికి ఎంత వర్క్ చేసుంటాడో అనిపిస్తుంది. ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాలను చూసి ఆహో, ఓహో అంటూ మురిసిపోయిన సినీ ప్రేక్షకులకు.. ఏ మాత్రం తగ్గకుండా సినిమాను చెక్కాడు. ఇక ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి భారీ కాస్ట్ మెస్మరైజ్ చేశారు.

వీళ్లే కాదు క్యామియో అప్పీయరెన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. ఇక 2020లో ఈ సినిమాను ఎనౌన్స్ చేయగా.. కరోనా కారణంగా కాస్త ఆలస్యం నెలకొంది. అయితే కల్కి 2898 ఏడీకి ముందు ఈ మూవీకి ప్రాజెక్ట్ కే అనే పేరు పెట్టారు. చాలా మందికి అసలు ప్రాజెక్ట్ కే ఏంటో తెలియదు.. కొంత మంది కల్కి అని, కలి అని ఏదేదో ఊహించుకున్నారు. కానీ సినిమా రిలీజైన నేపథ్యంలో అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటో తెలిసింది. ఈ పేరుకు సినిమాతో లింక్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విలన్ సుప్రీమ్ యాస్కిన్( కమల్ హాసన్).. ఓ సామ్రాజ్యాన్ని సృష్టించి ఆర్మీని ఏర్పాటు చేసుకుంటాడు. కాశీ ప్రజలకు ఆ ఆర్మీ చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఫెర్టిలిటీతో ఉన్నఅమ్మాయిలపై ప్రయోగం చేస్తుంటారు సుప్రీమ్ ఆర్మీ. అదే ప్రాజెక్ట్ కే.

యాస్కిన్ ఇచ్చిన ఫార్ములాను ఫెర్టిలిటీతో ఉన్న అమ్మాయిల గర్భంలోకి ఇంజెక్ట్ చేస్తుంటారు. అందులో 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుండి సీరమ్ కలెక్ట్ చేయాలని విలన్ ఆదేశాలు జారీ చేస్తాడు. కానీ ఆ ఫార్ములాను ఏ అమ్మాయి కూడా మోయలేకపోతుంది. కానీ సుమతి (దీపిక పదుకొణె) మాత్రం 150 రోజులు మోస్తూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంది. ఇంతకు ఈ ప్రాజెక్ట్ కే ఏంటీ. ఎందుకు యాస్కిన్ ఈ పని చేస్తున్నాడు. ఇక ప్రాజెక్ట్ కే పూర్తి వివరాలు తెలియాలంటే సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో భైరవ ఎవరు.. అశ్వత్థామకు అతడికి ఎందుకు యుద్ధం జరుగుతుంది. సుమతి ఎవరు అనే వివరాలు తెలియాలంటే..కల్కి 2898 ఏడీలో చూసేయాల్సిందే. ఇందులో అశ్వత్థామ, యాస్కిన్, భైరవ, సుమతి క్యారెక్టర్స్ కీలకంగా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి