iDreamPost

ఇంగ్లండ్‌తో సెమీస్‌కి ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌!

  • Published Jun 27, 2024 | 2:31 PMUpdated Jun 27, 2024 | 2:31 PM

Virat Kohli, IND vs ENG, T20 World Cup 2024: సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టేందుకు టీమిండియా రెడీ అయిపోయింది. అయితే.. మ్యాచ్‌కి ముందు భారత్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ అందింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, IND vs ENG, T20 World Cup 2024: సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టేందుకు టీమిండియా రెడీ అయిపోయింది. అయితే.. మ్యాచ్‌కి ముందు భారత్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ అందింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 27, 2024 | 2:31 PMUpdated Jun 27, 2024 | 2:31 PM
ఇంగ్లండ్‌తో సెమీస్‌కి ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ రోజు(గురువారం) గయానా వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది రోహిత్‌ సేన. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సెమీ ఫైనల్‌ 1లో ఆఫ్ఘనిస్థాన్‌పై సూపర్‌ విక్టరీ కొట్టిన సౌతాఫ్రికా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు ఇంగ్లండ్‌ను ఓడించి.. సౌతాఫ్రికాతో ఫైనల్‌ ఆడాలని రోహిత​్‌ అండ్‌ కో ఉవ్విళ్లూరుతోంది.

ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేని టీమిండియా.. సెమీస్‌లో కూడా అదే టెంపోను కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియాకు ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ అందింది. అదేంటంటే.. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు నెట్స్‌లో కఠోర సాధన చేసిన కోహ్లీ.. సూపర్‌ షాట్లు, పర్ఫెక్ట్‌ టైమింగ్‌తో తన లయను అందుకున్నట్లు క్రికెట్‌ నిపుణులు సైతం పేర్కొంటున్నారు.

కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు ఆడితేనే ఇంగ్లండ్‌పై విజయం సాధ్యమవుతుందని క్రికెట్‌ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే.. గయానా లాంటి స్లో పిచ్‌లపై కోహ్లీ లాంటి సీనియర్‌ బ్యాటర్‌ నిలబడి రన్స్‌ చేస్తేనే టీమిండియా మంచి స్కోర్‌ చేయగలదు. అయితే.. గత కొన్ని మ్యాచ్‌లుగా కోహ్లీ విఫలం అవుతుండటం భారత క్రికెట్‌ అభిమానులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఓపెనర్‌గా ఆడించడం వల్లే ఈ సమస్య తలెత్తుందని.. కోహ్లీని వన్‌డౌన్‌లోనే ఆడించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు నెట్స్‌లో కోహ్లీ మంచి టచ్‌లో కనిపించడంతో టీమిండియాలో కొత్త జోష్‌ వచ్చినట్లు సమాచారం. మరి కోహ్లీ తిరిగి ఫామ్‌ను అందుకుంటాడని, సెమీస్‌లో టీమిండియాను గెలిపిస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి