iDreamPost

Virat Kohli: ఫామ్​లో లేకపోయినా కోహ్లీ మీదే ఆశలు.. ఈ రికార్డే దీనికి కారణం!

  • Published Jun 27, 2024 | 3:55 PMUpdated Jun 27, 2024 | 3:55 PM

సిసలైన పోరుకు సిద్ధమైంది టీమిండియా. పొట్టి కప్పు సెమీస్​లో ఇంగ్లండ్​తో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం నాకౌట్ ఫైట్ జరగనుంది.

సిసలైన పోరుకు సిద్ధమైంది టీమిండియా. పొట్టి కప్పు సెమీస్​లో ఇంగ్లండ్​తో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం నాకౌట్ ఫైట్ జరగనుంది.

  • Published Jun 27, 2024 | 3:55 PMUpdated Jun 27, 2024 | 3:55 PM
Virat Kohli: ఫామ్​లో లేకపోయినా కోహ్లీ మీదే ఆశలు.. ఈ రికార్డే దీనికి కారణం!

సిసలైన పోరుకు సిద్ధమైంది టీమిండియా. పొట్టి కప్పు సెమీస్​లో ఇంగ్లండ్​తో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం నాకౌట్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే మొదటి సెమీస్ ముగిసింది. ఇందులో సౌతాఫ్రికా-ఆఫ్ఘానిస్థాన్ తలపడ్డాయి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​ను ఓడించి ఫుల్ జోష్​లో ఉన్న రషీద్ సేన ప్రొటీస్​ను కూడా కంగుతినిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ వన్​సైడ్ అయిపోయింది. ఆఫ్ఘాన్​ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది సౌతాఫ్రికా. ఆ టీమ్ ఫైనల్​కు దూసుకెళ్లింది. ఇప్పటికే ఒక బెర్త్ కన్ఫర్మ్ కావడంతో మరో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా-ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి ఫైనల్​కు చేరుకోవాలని ఇరు జట్లు డిసైడ్ అయ్యాయి. దీంతో ఆఖరి బంతి వరకు మ్యాచ్ నువ్వానేనా అంటూ సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంగ్లండ్​ను ఓడించేందుకు అవసరమైన అన్ని ప్లాన్స్​ను రెడీ చేస్తోంది భారత్. ఆ జట్టు ఆయువుపట్టు అయిన బ్యాటింగ్ యూనిట్​ను దెబ్బ తీసేందుకు బుమ్రా ఆధ్వర్యంలోని బౌలింగ్ దళాన్ని సంసిద్ధం చేస్తోంది. అలాగే మన బ్యాటింగ్​తో వాళ్ల బౌలర్లను చావబాదాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లు రోహిత్ శర్మ నేతృత్వంలోని బ్యాటింగ్ యూనిట్​ను రెడీ చేస్తోంది. ఆస్ట్రేలియా మీద 41 బంతుల్లో 92 పరుగులు చేసిన హిట్​మ్యాన్​ భీకర ఫామ్​లో ఉన్నాడు. అతడికి తోడు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె కూడా మంచి టచ్​లో ఉండటంతో టీమిండియాకు ఢోకా లేదని చెప్పొచ్చు. అయితే ఇంత మంది టాప్ ప్లేయర్లు ఉన్నా టీమ్ మేనేజ్​మెంట్ మాత్రం విరాట్ కోహ్లీ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అతడు రాణిస్తే జట్టుకు తిరుగుండదు.. ఇంగ్లీష్ టీమ్​పై ప్రతీకారం తీరడంతో పాటు ఫైనల్ బెర్త్ కూడా దక్కుతుందని అనుకుంటోంది.

కోహ్లీ ఎలాగైనా ఫామ్​ను అందుకోవాలని.. ఇంగ్లండ్​ను ఇరగదీయాలని అటు అభిమానులతో పాటు ఇటు టీమ్ మేనేజ్​మెంట్ కోరుకుంటోంది. విరాట్ సరిగ్గా ఆడకపోయినా ఇంతవరకు జట్టుకు ఎదురులేకుండా పోయింది. రోహిత్​తో పాటు ఇతర బ్యాటర్లు, బౌలింగ్ దళం రాణించడంతో టీమ్​ డబుల్ హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టింది. అయితే వీళ్లందర్నీ కాదని సెమీస్​లో కోహ్లీ మీదే ఎక్కువ ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకుంది మేనేజ్​మెంట్. దీనికి కారణం అతడి రికార్డులే. టీ20 వరల్డ్ కప్స్​ హిస్టరీలో నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్​ పేరు మీదే ఉంది. ఈ రికార్డు అతడ్ని పరుగులు చేసేలా రెచ్చగొడుతోంది. ఇప్పటిదాకా పొట్టి కప్పులో 4 నాకౌట్ మ్యాచుల్లో కలిపి 288 పరుగులు చేశాడు కింగ్. టీ20 ప్రపంచ కప్-2016లో వెస్టిండీస్ మీద 47 బంతుల్లో 89 నాటౌట్ బెస్ట్ స్కోర్​గా ఉంది. సెమీస్ పోరులో 4 హాఫ్ సెంచరీలు బాదాడు. అతడి స్ట్రైక్ రేట్ 152గా ఉంది. బిగ్ మ్యాచెస్​లో శివాలెత్తే కోహ్లీ ఇవాళ గనుక ఇంగ్లండ్​పై చెలరేగితే భారత్​కు తిరుగుండదు. మరి.. సెమీస్​లో విరాట్ బ్యాట్ గర్జిస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి