iDreamPost

ఒప్పో నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో బడ్జెట్‌లో ఇయర్ బడ్స్!

OPPO Enco Air4 Pro: ఒప్పో తాజాగా రెండు స్మార్ట్ ఫోన్స్ ని, స్మార్ట్ వాచ్ ని, ఇయర్ బడ్స్ ని లాంఛ్ చేసింది. ఒప్పో లాంఛ్ చేసిన ఈ డివైజెస్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వీటన్నిటికంటే ఇప్పుడు అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్న గాడ్జెట్ ఒప్పో ఎంకో ఎయిర్4 ప్రో ఇయర్ బడ్స్. వీటి ప్రత్యేకతలు ఏంటంటే?

OPPO Enco Air4 Pro: ఒప్పో తాజాగా రెండు స్మార్ట్ ఫోన్స్ ని, స్మార్ట్ వాచ్ ని, ఇయర్ బడ్స్ ని లాంఛ్ చేసింది. ఒప్పో లాంఛ్ చేసిన ఈ డివైజెస్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వీటన్నిటికంటే ఇప్పుడు అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్న గాడ్జెట్ ఒప్పో ఎంకో ఎయిర్4 ప్రో ఇయర్ బడ్స్. వీటి ప్రత్యేకతలు ఏంటంటే?

ఒప్పో నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో బడ్జెట్‌లో ఇయర్ బడ్స్!

ఒప్పో తాజాగా ఒక లాంఛ్ ఈవెంట్ ని నిర్వహించింది. అందులో భాగంగా ఒప్పో రెనో 12, రెనో 12 ప్రో స్మార్ట్ ఫోన్స్ ని ప్రకటించింది. వీటితో పాటు ఒప్పో వాచ్ ఎక్స్ స్మార్ట్ వాచ్ ని, ఎంకో ఎక్స్3ఐ, ఎంకో ఎయిర్4 ప్రో ఇయర్ బడ్స్ ని లాంఛ్ చేసింది. ఇవన్నీ ఈ ఏడాదిన చైనాలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు యూరప్ లో ఎంట్రీ ఇచ్చాయి. అయితే వీటిలో అందరి అటెన్షన్ ఐ డ్రా చేసిన గాడ్జెట్ ఒప్పో ఎంకో ఎయిర్4 ప్రో ఇయర్ బడ్స్. బడ్జెట్ లో దొరుకుతుండడం, క్వాలిటీ గాడ్జెట్ కావడంతో ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ట్రూ వైర్ లెస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తుంది. ఎక్స్ ట్రా క్లియర్ కాల్ విత్ ట్రిపుల్ మైక్రోఫోన్ సిస్టం, 12.4 ఎంఎం ఎక్స్ ట్రా లార్జ్ డ్రైవర్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, 49 డీబీ నాయిస్ క్యాన్సిలేషన్ డెప్త్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. దీని నాయిస్ క్యాన్సిలేషన్ ఫీక్వెన్సీ రేంజ్ 4000 హెడ్జెస్. హై పెర్ఫార్మెన్స్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది.   

ఒప్పో ఎంకో ఎయిర్4 ప్రో స్పెసిఫికేషన్స్:

  • అల్ట్రా వైడ్ ఫ్రీక్వెన్సీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్   
  • ఎల్హెచ్సీడీ 5.0తో కూడిన హై రిజల్యూషన్ ఆడియో 
  • 44 గంటల వరకూ ప్లేబ్యాక్ 
  • బ్లూటూత్ 5.4 లో లేటెన్సీ ట్రాన్స్మిషన్ 

ఇది రెండు రంగుల్లో లభిస్తుంది. మూన్ లైట్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్ లో వస్తుంది. ఇయర్ బడ్స్ ని ఛార్జ్ చేయడానికి 60 నిమిషాలు, ఇయర్ బడ్స్ ని, ఛార్జింగ్ కేస్ ని ఛార్జ్ చేయాలంటే 80 నిమిషాల సమయం పడుతుంది. ఐపీ55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఇయర్ బడ్స్ తో గరిష్టంగా 12 గంటల వరకూ, ఛార్జింగ్ కేస్ తో గరిష్టంగా 44 గంటల పాటు కంటిన్యూగా మ్యూజిక్ ని ఆస్వాదించవచ్చు. అల్ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుండడం పవర్ బ్యాకప్ ఎక్కువగా ఉంటుంది. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ తో 4 గంటల ప్లే బ్యాక్ ఇస్తుంది. దీని ధర    79.90 యూరోలుగా కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మన కరెన్సీ ప్రకారం రూ. 7085 పడుతుంది. ఇది ఇంకా భారత మార్కెట్లో అడుగుపెట్టడానికి సమయం పడుతుంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి