iDreamPost

పక్షవాతం వచ్చినా, కళ్ళు కనిపించకున్నా తమ పని చేసుకోగలుగుతారు!

Neuralink Brain Chip: ఒక మనిషికి పక్షవాతం వచ్చి మాట పడిపోతే చచ్చేవరకూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అలానే కంటిచూపు లేని వారికి కూడా. కానీ ఎలాన్ మస్క్ ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ తో తమ పనులు తాము చేసుకునేలా ఒక టెక్నాలజీని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి ప్రయోగం సక్సెస్ కూడా అయ్యింది.

Neuralink Brain Chip: ఒక మనిషికి పక్షవాతం వచ్చి మాట పడిపోతే చచ్చేవరకూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అలానే కంటిచూపు లేని వారికి కూడా. కానీ ఎలాన్ మస్క్ ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ తో తమ పనులు తాము చేసుకునేలా ఒక టెక్నాలజీని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి ప్రయోగం సక్సెస్ కూడా అయ్యింది.

పక్షవాతం వచ్చినా, కళ్ళు కనిపించకున్నా తమ పని చేసుకోగలుగుతారు!

పక్షవాతం వస్తే కాళ్ళూ, చేతులూ పడిపోయి ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తే తప్ప వారికి వారు సొంత పనులు చేసుకోలేని పరిస్థితి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వీల్ చైర్స్ వచ్చాయి కానీ ముందుకు కదలాలంటే వాటిని చేతులతో ఆపరేట్ చేయాలి. అయితే అసలు చేతులు కూడా పనిచేయని వారి పరిస్థితి ఏంటి. మెదడు తప్ప శరీరంలో ఏ అవయవాలు పని చేయని వారి పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుంది. మాట కూడా పడిపోతుంది. ఇక కళ్ళు కనిపించని వారి గురించి చెప్పాల్సిన పని లేదు. వీరంతా ఎవరో ఒకరి మీద ఆధారపడితే తప్ప జీవించలేని పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఎలాన్ మస్క్ ఇలాంటి వారి కోసం ఒక కొత్త పరికరాన్ని సిద్ధం చేస్తున్నారు. మానవ మెదడులో న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ని అమర్చి.. ఆలోచనలతోనే తమ పనులు చేసుకునేలా ఒక విప్లవానికి నాంది పలికారు. ఈ ప్రయోగంలో భాగంగా తొలిసారి ఒక మనిషి మీద ఈ చిప్ ని అప్లై చేశారు. 

న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ని మెదడులో అమర్చుకున్న మొట్టమొదటి వ్యక్తి నోలాండ్ అర్బాగ్. 2016లో జరిగిన యాక్సిడెంట్ లో పక్షవాతానికి గురయ్యాడు. దీంతో ఎటూ కదల్లేని పరిస్థితి. కానీ ఇప్పుడు అతని ఆలోచనలతో డిజిటల్ కర్సర్ ని కదిలించగలుగుతున్నాడు. వెబ్ సైట్ లో బ్రౌజింగ్ చేయగలుగుతున్నాడు. మెసేజులు పంపించగలుగుతున్నాడు. వీడియో గేమ్స్ ఆడగలుగుతున్నాడు. దీంతో నోలాండ్ ఈ టెక్నాలజీ చాలా అద్భుతం అంటూ మురిసిపోతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా నోలాండ్ న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఒక కంప్యూటర్ ని కేవలం ఆలోచనలతో కంట్రోల్ చేసేలా బ్రెయిన్ చిప్ ఎలా పని చేసిందో అనే విషయాన్ని వెల్లడించారు. భుజాల నుంచి కింది వరకూ నోలాండ్ పక్షవాతానికి గురయ్యాడు.

అయితే కంప్యూటర్ మౌస్ పాయింటర్ కదిలికలను ఊహించడం ద్వారా అది కంప్యూటర్ ని ఎలా నియంత్రిస్తుందో అనే విషయాన్ని వెల్లడించారు. ప్రయోగం మొదట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కానీ ఇప్పుడు ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో నోలాండ్ తనకు ఇష్టమైన వ్యక్తులతో సంభాషించగలుగుతున్నాడు. పుస్తకాలు చదవగలుగుతున్నాడు, వీడియో గేమ్స్ ఆడగలుగుతున్నాడు. అప్పట్లో స్టీఫెన్ హాకింగ్ కూడా పక్షవాతం వచ్చి పడిపోతే ఆయన బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలను టెక్నాలజీ సాయంతో తెలుసుకునే ప్రయత్నం చేసేవారు శాస్త్రవేత్తలు. ఆయన మెదడులో ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు నిక్షిప్తమై ఉండడంతో.. వాటిని వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు ఆయన బ్రెయిన్ ని హ్యాక్ చేశారు.

ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా పక్షవాతం వచ్చిన వ్యక్తుల కదలికలను తిరిగి పొందేందుకు, పుట్టుకతో అంధులుగా ఉన్నవారి కంటిచూపుని పునరుద్ధరించడానికి ఈ న్యూరాలింక్ టెక్నాలజీని 2016లో కనుగొన్నారు. తాజాగా నోలాండ్ విషయంలో ఎలాన్ మస్క్ విజయవంతమవ్వడంతో.. ఈ జూన్ నెలలో రెండో రోగి మెదడులో ఈ బ్రెయిన్ చిప్ ని అమర్చనున్నారు. ఏడాది చివరి నాటికి 10 మందిలో ఈ న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ని అమర్చేందుకు న్యూరాలింక్ ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్రెయిన్ చిప్ కోసం ఇప్పటికే వెయ్యి మంది పక్షవాతం వచ్చిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇవి సక్సెస్ అయితే కనుక పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉన్నవారు, కంటి చూపు లేనివారు ఆలోచనలతో టెక్నాలజీని కంట్రోల్ చేసి తమ పనులను చేసుకోగలుగుతారని న్యూరాలింక్ చెబుతోంది.

ఉదాహరణకు పక్షవాతం వచ్చిన ఏ బయటకో వెళ్ళాలి అని అనుకుంటే కనుక వేరే మనిషి అవసరం లేకుండా అడ్వాన్స్డ్ వీల్ చైర్ తో బ్రెయిన్ చిప్ ద్వారా కమ్యూనికేట్ అయితే కనుక అదే అతన్ని బయటకు తీసుకెళ్తుంది. అలానే కంటిచూపు లేని వారిని కూడా. అయితే ఈ బ్రెయిన్ చిప్ ని ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉంది కదా అనుకోవచ్చు. దానిపై కూడా నోలాండ్ క్లారిటీ ఇచ్చాడు. తన బ్రెయిన్ చిప్ ని కొందరు హ్యాక్ చేయాలని చూశారని.. కానీ ఇందులో ఉన్న పవర్ ఫుల్ కోడింగ్ వల్ల హ్యాకర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నాడు.   

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి