iDreamPost

ఇంట్లో కుక్కలను పెంచుకుంటున్నారా? ముందు ఈ తండ్రికొడుకుల కథ తెలుసుకోండి!

  • Published Jun 26, 2024 | 2:50 PMUpdated Jun 26, 2024 | 3:09 PM

ఇప్పటి వరకు వీధి కుక్కలే అనుకున్నాం కానీ, ఇప్పుడు ఇంట్లో పెంచే పెంపుడు శునకాలతో కూడా చాలా ప్రమాదం ఉందని ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్ వలన ఓ ఇద్దరు తండ్రి కొడుకుల తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇప్పటి వరకు వీధి కుక్కలే అనుకున్నాం కానీ, ఇప్పుడు ఇంట్లో పెంచే పెంపుడు శునకాలతో కూడా చాలా ప్రమాదం ఉందని ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్ వలన ఓ ఇద్దరు తండ్రి కొడుకుల తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jun 26, 2024 | 2:50 PMUpdated Jun 26, 2024 | 3:09 PM
ఇంట్లో కుక్కలను పెంచుకుంటున్నారా? ముందు ఈ తండ్రికొడుకుల కథ తెలుసుకోండి!

ప్రస్తుత కాలంలో పెట్ డాగ్స్ ను పెంచుకోవడం కూడా ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతిఒక్కరి ఇంట్లో పెట్ డాగ్స్ పెంచుకోవడం కామన్ అయిపోయింది. అయితే కొంతమంది ఇష్టంతో పెంచుకుంటే.. మరి కొందరు ట్రెండ్ తగ్గట్టుగా ఫాలో అవుతున్నారు. అయితే ఏదీ ఏమైనా వాటిని భారీ నగదుకు కొనుగోలు చేసి పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పైగా వాటిని తమ ఇంట్లో మనుషుల కంటే ఎక్కువగా.. ప్రాణంగా ప్రేమిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. పెంపుడు శునకాలను సొంత పిల్లలా వాటి అలనా పాలానా చూసుకుంటున్నారు.అంతేకాకుండా.. వాటికి ఏ చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేరు. అవి అనారోగ్యనికి గురయ్యి తినకపోయినా.. చనిపోయినా, చాలా ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారు. మరి అంత ఇష్టంగా పెంచుకున్న ఈ పెంపుడు శునకాల వాళ్ల కొన్ని సందర్భాల్లో ఊహించని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి.అందుకు తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనం. ఇంట్లో పెంచుకున్న పెంపుడు శునకం వలన ఓ ఇద్దరు తండ్రి కొడుకుల తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇప్పటి వరకు వీధి కుక్కలే అనుకున్నాం కానీ, ఇప్పుడు ఇంట్లో పెంచే పెంపుడు శునకాలతో కూడా చాలా ప్రమాదం ఉందని ఇటీవల కాలంలో జరిగే సంఘటనలే నిదర్శనం. కాగా, ఆ మధ్యకాలంలో జరిగిన ఓ ఘటనలో ఒక కుటుంబం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెట్ డాగ్ తమ నెలల చిన్నారిని పీకుకు తిన్న భయంకర ఘటన అందరికి తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే మరో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఇంట్లో ప్రాణంగా పెంచుకున్న పెంపుడు శునకం ఓ ఇద్దరి తండ్రి కొడుకుల ప్రాణలు పోవడానికి కారణమైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. విశాఖపట్నం భీమిలిలోని పెంపుడు కుక్క కాటుకు ఇద్దరూ తండ్రి కొడుకులు మృతి చెందారు. అయితే వారి ఇంట్లో గత వారం క్రితం తండ్రి నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27)ను వారి పెట్ డాగ్ కరిచింది. కాగా, భార్గవ్ ను ముక్కు మీద కరవగా, తండ్రి నర్సింగ్ రావును కాలిపై కరిచింది. ఇక అది జరిగి వారం రోజుల జరిగినా.. గత రెండు రోజుల క్రితం వారి పెంపుడు కుక్క చనిపోవడం వారు షాక్ కు గురయ్యారు. దీంతో అలెర్ట్ అయిన తండ్రి, కొడుకులు వెంటనే రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే.. వారి ఇద్దరికి బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే. తండ్రి కొడుకులు మరణించారు. దీంతో వారి ఇంట్లో పెంపుడు శునకం కారణంగా ఊహించని విషాదం చోటు చేసుకుంది.

అయితే ఇలా గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెంపుడు శునకాల కారణంతో పలు చోట్ల వివిధ భయంకరమైన సంఘనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పెట్ డాగ్స్ పై ప్రేమ ఉన్నవారు, వాటిని పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు సైతం ఇలాంటి ఘటనలు చూసి ఉలిక్కిపడుతున్నారు. అలాగే వాటిని పెంచుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే.. ఈ పెట్ డాగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. కనుక ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అందుకోసమే పెట్ డాగ్స్ ను పెంచుకుంటే కోరి చావు తెచ్చుకున్నట్లు అవతుందని చాలామంది వాటిని పెంచుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. మరి, పెంపుడు శునకం కాటేయడంతో ఇద్దరు తండ్రి, కొడుకులు మృతిచెందిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి