iDreamPost

సూర్యుడు పడమర ఉదయించినా సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: నాని

Kodali Nani, YS Jagan: వైఎస్సార్ సీపీలోని కీలక నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. అలానే చంద్రబాబుపై తరచూ ఫైర్ అయ్యే నేతల్లో నాని ముందు ఉంటారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ..చంద్రబాబును ఓ ఆట ఆడుకుంటారు నాని. తాజాగా మరోసారి కొడాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kodali Nani, YS Jagan: వైఎస్సార్ సీపీలోని కీలక నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. అలానే చంద్రబాబుపై తరచూ ఫైర్ అయ్యే నేతల్లో నాని ముందు ఉంటారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ..చంద్రబాబును ఓ ఆట ఆడుకుంటారు నాని. తాజాగా మరోసారి కొడాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూర్యుడు పడమర ఉదయించినా సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: నాని

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడి పొలిటికల్ హీట్ తీవ్ర స్థాయిలో ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ  ఉక్కపోత మరీ ఎక్కువైంది. ఎప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇటీవలే జెండ సభలో సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీప నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారాన్ని ఎవ్వరూ ఆపలేరంటూ తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో జరిగిన వైస్సార్ సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి కొడాలి నాని వివరించారు. అదే విధంగా ఇటీవల సీఎం జగన్ పై ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా  జగన్‌మోహన్‌రెడ్డినే ప్రమాణస్వీకారం చేస్తారని కొడాలి నాని అన్నారు. ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. మే చివర్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరని, చంద్రబాబు, పవన్‌, సోనియా లాంటి వాళ్లు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్ ను ఓడించలేరని అన్నారు.

వాళ్లకు సీఎం జగన్‌ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవని పేర్కొన్నారు. నవ్వుతూ జైలుకెళ్ళిన సీఎం జగన్, 16 నెలల తర్వాత కూడా అదే చక్కటి చిరునవ్వుతో బయటకు వచ్చాడని, ఆయన ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదని నాని చెప్పుకొచ్చారు. మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తిరని, ఇలాంటి సైకోలందరూ కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వేధిస్తున్నారని కాని దుయ్యబట్టారు. 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తినా, కొవిడ్ కారణంగా ఇబ్బందులు వచ్చినా, ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించారని, అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని.. కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడని కొడాలి నాని అన్నారు. మరి.. మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి