iDreamPost
android-app
ios-app

వాహనదారులు ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి! లేకుంటే అంతే సంగతులు!

  • Published Jul 24, 2024 | 2:06 PM Updated Updated Jul 24, 2024 | 2:06 PM

New Traffic Rules: ఇటీవల దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అవగాహన లేమి, నిద్ర లేమి ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

New Traffic Rules: ఇటీవల దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అవగాహన లేమి, నిద్ర లేమి ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

వాహనదారులు ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి! లేకుంటే అంతే సంగతులు!

దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు చదువుతూనే ఉన్నాం. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చిన వాళ్లు తిరిగి ఇంటికి వెళ్తారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాహన లేకుండా మైనర్లు వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో సెఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వాహనదారులు రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ద్విచక్ర వాహనాలు నడిపేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీసులు. ఇటీవల సిటీలో ఒకరు మరణిస్తే.. మరో నలుగురు తీవ్రంగా గాయపడుతున్నారు. కొన్నిసార్లు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఇతర వాహనదారులు, పాదాచారులు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. వీటన్నింటిని అరికట్టేందుకు కఠిన నియమాలు అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. రహదారుల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెల్ దరించి వాహనాలు నడపాలని రూల్ తీసుకువచ్చినట్లు తెలిపారు. అంతేకాదు ఇకపై వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని విశాఖ నగర (ట్రాఫిక్) ఏడీసీపీ శ్రీనివాస రావు అన్నారు.

విశాఖ పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు నగరంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు విశాఖ నగర పరిధిలో హెల్మెట్ ధరించడం అవసరం లేదని.. కానీ ఇప్పుడు వరుస ప్రమాదాల దృష్ట్యా సిటీలో హెల్మెట్ ధరించాలని కొత్త రూల్ తెచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం విశాఖ నగరంలో ప్రధాన కూడలి అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హెల్మెట్ ధరించడం ప్రమాదాలను నియంత్రణకు హై కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

  • ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి
  • హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే ప్రాణాంతకం
  • ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి
  • BIS సర్టిఫికేషన్ హెల్మెట్లనే వాడాలి
  • బైక్ నడిపే వ్యక్తి గానీ, వెనుక కూర్చున్న వ్యక్తిగాని ఇద్దరిలో ఎవరు హెల్మెట్ పెట్టుకోకున్నా రూ.1035 చలానా విధించబడుతుంది
  • హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపి ప్రమాదానికి కారణం అయితే డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలె సస్పెండ్ అవుతుంది