P Krishna
Telugu States Heavy Rains: జులై మొదటి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
Telugu States Heavy Rains: జులై మొదటి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
P Krishna
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఎండలు దంచికొట్టాయి.. అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లల్లాడిపోయారు. జూన్ చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చాయి. రుతు పవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగిపోయాయి.. రహదారులన్నీ జలమయం అయ్యాయి. కాల్వలు, చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో గండి పడి గ్రామాలు నీట మునిగాయి. తెలంగాణ, ఏపీలో మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలోనే అధికారులు అలర్ట్ అయి భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో పాటు పిడుగులు పడే సూచన ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు.
తెలంగాణలో గురువారం ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జిగిత్యా, కరీంనగర్, జనగాం, కామారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల,మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట, నిర్మల్, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్సాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏపీ విషయానికి వస్తే.. కోస్తా జిల్లాలో మోస్తరు వర్షాలు పడే సూచన ఉందని.. ఏలూరు, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే అల్లూరి జిల్లాలో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తర కోస్తా తీరం వెంట 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మరో రెండు రోజుల వరకు మత్స్యకారులు వేలకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.