iDreamPost

జియో నుంచి అదిరిపోయే రీఛార్జ్ ఫ్లాన్.. తక్కువ ధరలో హైస్పీడ్ డేటా!

Jio Plan: రిలయన్స్‌ జియో తన వినియోగదారుల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ధరలో మీ డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చూస్తున్నవారి కోసం జియో నుండి అదిరిపోయే ప్లాన్ వచ్చింది.

Jio Plan: రిలయన్స్‌ జియో తన వినియోగదారుల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ధరలో మీ డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చూస్తున్నవారి కోసం జియో నుండి అదిరిపోయే ప్లాన్ వచ్చింది.

జియో నుంచి అదిరిపోయే రీఛార్జ్ ఫ్లాన్.. తక్కువ ధరలో హైస్పీడ్ డేటా!

ప్రస్తుతం ప్రతి ఒక్కరి  చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం అనేది కామన్ గా మారింది. అంతేకాక దీనిని ఉపయోగించి చాలా మంది సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. ముఖ్యంగా టెలికాం సంస్థలు అందిస్తున్న వివిధ రకాల ఆఫర్లతో నెట్ సులభంగా లభిస్తుంది. ఒకరికి మించి మరొకరు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తూ..కస్టమర్లను ఆకట్టుంటున్నాయి. అలాంటి ప్లాన్ లో రిలయన్స్ జియో ముందు ఉంటుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోదారులను సొంతం చేసుకున్న జియో.. ఆ సంఖ్యను మరింత పెంచుకునేందుకు తరచూ అనేక ఆఫర్లు ప్రకటిస్తుంది. తాజాగా జియో అందిస్తున్న ఓ రీఛార్జ్ ప్లాన్ తో హైస్పీడ్ డేటాను పొందవచ్చు. మరి.. వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టెలికాలం రంగంలోనే ఇది ఓ పెను సంచలనం. జియో రాక ముందు వరకు ఒకలా ఉన్న టెలికాం మార్కెట్.. దాని ఎంట్రీతో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తక్కువ ధరకే డేటాను అందిచడంతో పాటు అనేక అదరిపోయే ఆఫర్లతో జియో అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే కొంత మందికి జియో సినిమాలు ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చింది. అంతేకాక వివిధ రకాల కస్టమర్లకు వారికి తగిన ఆఫర్లను జియో అందిస్తుంది.

jio data

ఇలా తన కస్టమర్ల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది జియో కంపెనీ.  చాలా మందికి తక్కువ ధరలో రోజు వారి డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అలా వారి కోసం జియో నుండి ఈ ప్లాన్ అందిస్తోంది. రోజువారీ డేటా పరిమితి లేకుండా ఉండటమే ఈ ప్లాన్ ప్రత్యేకత. ఇక ఎవరైనా ఎక్కువ నెట్ ను వినియోగించే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా డేటాను వినియోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ లో కేవలం డేటానే కాకుండా కాలింగ్స మేసేజ్స్ వంటి అనేక ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జియో ఈ ప్లాన్ ధర రూ. 296. ఈ రీఛార్జ్  ప్లాన్ కాలపరిమితి నెల రోజులు ఉంటుంది.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఇందులో రోజువారీ డేటా పరిమితి ఇవ్వలేదు. ఎలాంటి అంతరాయం లేకుండా డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల్లో 25 జీబీ డేటాను జియో అందిస్తోంది. అలాగే ఏ నెట్‌వర్క్ కైనా  కాల్ చేయడానికి అపరిమిత ఫోన్ కాలింగ్ సౌకర్యం అందిస్తోంది. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లులు చేసుకునే సదుపాయం ఉంది. దీనితో పాటు, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌట్ యాక్సస్ కూడా అందించబడుతుంది. ఈ రీఛార్జ్ ఫ్లాన్ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను అందిస్తుంది. మరి.. జియో అందిస్తున్న ఈ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి