iDreamPost

సంచలనం సృష్టించిన ఐస్‌క్రీమ్ లో వేలు.. ఎవరిదో తెలిసింది!

Organ in the Ice Cream: కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ లో మనిషి వేలు వచ్చిన సంఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసింది. తాజాగా ఆ వేలు ఎవరిది,ఎలా వచ్చిందనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Organ in the Ice Cream: కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ లో మనిషి వేలు వచ్చిన సంఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసింది. తాజాగా ఆ వేలు ఎవరిది,ఎలా వచ్చిందనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సంచలనం సృష్టించిన ఐస్‌క్రీమ్ లో వేలు.. ఎవరిదో తెలిసింది!

ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆహారం పదార్ధం అంటే ఇష్టం ఉంటుంది. ఇలానే ఎక్కువ మందికి ఐస్ క్రీమ్ తినడం అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కువ మంది ఐస్ క్రీమ్ ను తినేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు అయితే వానాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇది ఇలా ఉంటే.. ఇక కొందరు షాపులకు వెళ్లి కొనుగోలు చేయగా, మరికొందరు ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతుంటారు. ఇలా ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిన ఓ కస్టమర్ కి ఊహించిన షాక్ తగిలింది. తాను ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్ లో మనిషి వేలు ప్రత్యక్షమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుతపోయే నిజాలు తెలిశాయి. మరి.. వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలోని ఓ డాక్టర్ కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు. ఇక ఇంటికి వచ్చిన ఐస్ క్రీమ్ ను ఎంతో ఇష్టంగా తినాలి ఆ వ్యక్తి భావించి..దానిని ఓపెన్ చేశాడు. అలా ఐస్ క్రీమ్ ను ఓపెన్ చేయగానే అందులో వచ్చిన దానిని చూసి..షాకి గురయ్యాడు. అందులే మనిషి వేళు ప్రత్యక్షమైంది. కాసేపు ఆందోళనకు గురైన సదరు వ్యక్తి..తేరుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఐస్ క్రీమ్ లో మనిషి వేలు కనిపించి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేసే క్రమంలో పోలీసులు ఆ ఐస్ క్రీమ్ ను తయారు చేసిన ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసిన ఫ్యాక్టరీ పూణేలో ఉన్నట్లు పోలులు గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. అక్కడ పనిచేస్తున్న ఓంకార్ అనే వ్యక్తి వేలు తెగినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడికి, ఐస్ క్రీమ్ లో వచ్చిన వేలుకి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా.. ఒకటే అని తేలింది. ఇందాపూర్ ఫ్యాక్టరీలో కోన్‌లో ఐస్‌క్రీమ్ నింపే సమయంలో ఓంకార్ వేలిలో కొంత భాగం కట్ అయింది.

ఇది ఆ తర్వాత ఐస్‌క్రీం కొన్‌లో పడిపోయింది. అలా అది ఆర్డర్ చేసిన ఐస్‌క్రీంలో సదరు వైద్యుడికి చేరింది. ఇక ఈ సంఘటనపై బాధితుడైన డాక్టర్ కీలక విషయాలను వెల్లడించారు. తాను ఐస్ క్రీమ్ తినే క్రమంలో సగంలోకి వచ్చే సరికి..అకస్మాత్తుగా అక్కడ పెద్ద ముక్క కనిపించదని తెలిపారు. అయితే తొలుత అది పెద్ద గింజగా ఆయన భావించినట్లు. అదృష్టవశాత్తూ, దానిని తినలేదని తెలిపారు. దానిని దగ్గరగా చూసిన తర్వాత అది మనిషి వేళుగా తను గుర్తించినట్లు తెలిపాడు. అది 2 సెంటీమీటర్ల మనిషి వేలు అని అర్థమైంది. ఈ ఘటనతో షాక్‌కి గురయ్యానని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డాక్టర్ తెలిపాడు. మొత్తంగా దేశ వ్యాప్తంగా వైరల్ అయినా ఈ ఘటనలో తాజాగా అసలు నిజాలు  బయటకి వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి